ఈద్గా వద్ద పండుగ పనులను పర్యవేక్షించిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ !


J.SURENDER KUMAR,

బక్రీద్ పండుగ పర్వదినం పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలో ఈద్గా వద్ద పండుగ పనుల ఏర్పాట్లను, పారిశుధ్య పనులను మంగళవారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ మున్సిపల్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్, కమిషనర్ డా.నరేష్, DE రాజేశ్వర్, స్థానిక కౌన్సిలర్ పంబాల రామ్ కుమార్, మైనార్టీ విభాగం పట్టణ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ ముజాహిధ్, AMC వైస్ చైర్మన్ అసిఫ్, పట్టణ పార్టీ ఉప అధ్యక్షులు తాజోద్దిన్, జిల్లా RTA మెంబర్ సుధాకర్ రావు, కౌన్సిలర్ చాంద్ పాషా, నాయకులు కుస్రుహజారి, ఫిరోజ్,జావేద్, అహమ్మద్, అస్ఘర్ షా, ఖలేమ్,
,జహంగీర్, కౌన్సిలర్ లు,కో ఆప్షన్ సభ్యులు, నాయకులు,మైనార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థిని సమీక్ష కు అభినందనలు!

రాయికల్ మండల ధావన్ పల్లి గ్రామానికి చెందిన భూక్య సమీక్ష రాయికల్ లోని కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతిలో మంచి మార్కులు సాధించి కరీంనగర్ ట్రినిటీ కళాశాలలో ఇంటర్మీడియట్ బై పి సి లో ప్రభుత్వము ద్వారా ఉచిత సీటు సాధించిన  సమీక్షను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ యమునా రవీందర్, తదితరులు ఉన్నారు.

షాది ముబారక్ చెక్ ల పంపిణీ

జగిత్యాల పట్టణ 31వవార్డు కి చెందిన బి బి బేగంకి, పట్టణానికి చెందిన పర్హీన్ సుల్తానా కు షాదీ ముబారక్ పథకం ద్వారా ఒక్కొక్కరికి మంజూరైన ఒక లక్ష రూపాయలు విలువగల చెక్కులను మరియు చీరలను జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సంజయ్ కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రిజ్వాన్, కొలగానీ సత్యం, జుంబర్తి శంకర్, పాక్స్ ఛైర్మెన్ నరసింహ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.