ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.
J. SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అలియా నాయక్ తండా గిరిజన గ్రామంలో శనివారం ఎమ్మేల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కలెక్టర్ షేక్ యాసిన్ భాషా తో కలసి తో కలిసి తెలంగాణ గిరిజనోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత 20 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతి భవన నిర్మాణానికి ఎమ్మేల్యే, కలెక్టర్ లు శంఖుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల కోసం ప్రవేశ పెడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని మారుమూల గిరిజన తండాల నుండి 3146 గిరిజన గ్రామ పంచాయతీ స్థాయికి తీసుకు రావడం తో పాటు 6 నుండి 10 శాతానికి రిజర్వేషన్లు కల్పించిన విప్లవాత్మక ఘనత తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి దే అని అన్నారు. గడచిన తొమ్మిదేళ్ళ కాలంలో గిరిజనాభ్యూదయానికి ₹53 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని, 1.01 లక్షల ఇండ్లకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం జరిగిందని తెలిపారు. త్రాగునీరు, సాగునీరు సదుపాయాలు కల్పించడం, పొడు భూములకు హక్కు పత్రాలు అందించామని తెలిపారు.

పోటీ పరీక్షలలో గిరిజన విద్యార్థులు హాజరై ఉన్నత ఉద్యోగాలు సాధించాలని కోరారు. వర్షాకాలంలో గిరిజన గ్రామాలకు రహదారులు దెబ్బతింటే వెంటనే మరమ్మత్తులు చేపట్టడం జరిగిందని తెలిపారు. మన ఊరు మన బడి కార్యక్రమం క్రింద పాఠశాలల్లో పనులు చేపట్టడం, పూర్తి చేయడం జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం గ్రామంలోని గిరిజన పెద్దలను సన్మానించారు. అంతకు ముందు గిరిజన సంప్రదాయ నృత్యాలలో ఎమ్మేల్యే పాల్గొని నృత్యం చేశారు. సంప్రదాయ నృత్యాలతో, బతుకమ్మలతో కలెక్టర్ కు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తొమ్మిదేళ్ళ తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతిని ఈ కార్యక్రమంలో వివరించాల్సిన అవసరం ఉందని, గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని, వాటిని అవగాహన చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తండాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రతీ 500 జనాభా గల తండాలను గ్రామ పంచాయతీల ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు. గిరిజన గ్రామాలలో రోడ్డు, మురికి కాల్వలు, వీధి లైట్లు, వైకుంఠ దామాలు, క్రీడా ప్రాంగణాలు వంటివి , మాలిక వసతులు కల్పించడం జరిగిందని ఆమె వివరించారు. సేవాలాల్ జయంతి, సమ్మక్క సారలమ్మ, గిరిజన సంస్కృతిని వివరించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నాయని తెలిపారు. కొత్తగా ఏర్పడిన పంచాయితీలకు భవనాలు నిర్మించడం జరుగుతున్నాయని తెలిపారు. గిరిజన ఆడపిల్లలకు చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేయకుండా వారు కోరిన విధంగా ఉచిత విద్యను ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో అందిస్తున్నారని, భోజనం, పుస్తకాలు, బట్టలు, ఉపకార వేతనాలు, తదితర వస్తువులు సమకూర్చడం జరుగుతున్నదని, వాటిని ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలకు స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసి రుణాలు అందిస్తున్నామని తెలిపారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ఆశ, ఏ ఎన్ ఎం లు ఇంటింటికి వచ్చి ఆరోగ్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటూ, ప్రభుత్వ సంకల్పానికి తోడ్పాటు అందించి సహకరించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మంద మకరంద, సర్పంచ్ నందునాయక్,
జెడ్పీటీసీ అశ్విని జాదవ్, ఎంపిపి సంధ్యా రాణి, ఎంపిడిఓ సంతోష్ కుమార్, మునిసిపల్ చైర్మన్ మొర హమ్మండ్లు, ఎంప్టిసి స్వప్న, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు , తదితరులు పాల్గొన్నారు.