గోదావరి హారతి యాత్రను విజయవంతం చేయండి!

జూన్ 3 నుండి 8 వరకు యాత్ర_

గోదావరి హారతి రాష్ట్ర కో-కన్వీనర్, రూట్ ఇన్చార్జ్ వెంకటరమణ !

J.SURENDER KUMAR,

గోదావరి హారతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జూన్ 3 నుండి 8వ తేదీ వరకు గోదావరి హారతి యాత్రను విజయవంతం చేయాలని గోదావరి హారతి రాష్ట్ర కో-కన్వీనర్, రాష్ట్ర రూట్ ఇన్చార్జ్ క్యాతం వెంకటరమణ కోరారు. శనివారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో క్యాతం వెంకటరమణ మాట్లాడారు.

గోదావరి హారతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జూన్ 3న నిజామాబాద్ జిల్లా కందకుర్తి నుండి ప్రారంభమై జూన్ 8 వరకు ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం చేరుకుంటుందని వెంకటరమణ తెలిపారు. బిజెపి జాతీయ నాయకులు గోదావరి హారతి వ్యవస్థాపక చైర్మన్ పి.మురళీధర్ రావు నేతృత్వంలో ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. జల వనరుల పరిరక్షణ దిశలో ప్రజలను సమాయత్తం చేయడంతో పాటు నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరాన్ని ఈ యాత్ర సందర్భంగా ప్రజలకు వివరిస్తామని తెలిపారు. మన రాష్ట్రంలో ఐదు జిల్లాల గుండా ప్రవహిస్తున్న గోదావరి జల వనరులను కలుషితం కాకుండా చేపట్టవలసిన చర్యలను వివరిస్తూ యాత్ర కొనసాగుతుందన్నారు. 6 రోజులపాటు సుమారు 800 కిలోమీటర్ల వరకు గోదావరి తీర ప్రాంతాలలోని 285 గ్రామాల గుండా యాత్ర చేపట్టడం జరుగుతుందన్నారు. జగిత్యాల జిల్లాలో జూన్ 5 సోమవారం ఇబ్రహీంపట్నం మండలం కొండాపూర్ లో ప్రవేశించి ధర్మపురిలోని రాయపట్నం వద్ద ముగుస్తుందని, అనంతరం మంచిర్యాల జిల్లాలో ప్రవేశిస్తుందన్నారు. జూన్ 5న సాయంత్రం ధర్మపురి లోని గోదావరి నదీమ తల్లికి హారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని ప్రాంత సంపర్క్ కో కన్వీనర్ వేముల సంతోష్, విశ్వహిందూ పరిషత్ నగర ఉపాధ్యక్షుడు తౌటు రామచంద్రం, కందుకూరి నారాయణ, నెల్లి చందు తదితరులు ఉన్నారు