గుడివాడకు అభివృద్ధికి నిధుల వరద
₹ 1000 కోట్లు నిధులు విడుదలకు హామీ!

గుడివాడ సభలో సీఎం జగన్  ప్రకటన


J.SURENDER KUMAR.

గుడివాడ ఎమ్మెల్యే నాని నియోజకవర్గంలో మరికొన్ని అభివృద్ధి పనుల కోసం నిధులు కావాలని కోరారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుడివాడలో జరిగిన బహిరంగ సభలో వేదిక  నుంచి అభివృద్ధి పనులకు దాదాపు ₹. 1000 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నానని సీఎం ప్రకటించారు.

గుడివాడలో ఎస్సీ శ్మశాన వాటిక కావాలన్నారు. ₹ 5 కోట్లవుతుందన్నారు. దాన్నిమంజూరు చేస్తున్నాను. టిడ్కో మాస్టర్‌ ప్లాన్‌ కోసం ముదినేపల్లి నుంచి బందరు రోడ్డుకు ₹ 17 కోట్లు ఖర్చవుతుందన్నారు. అదీ మంజూరు చేస్తున్నాం. మంచినీటిసరఫరా కోసం ల్యాండ్‌ అక్విజేషన్‌ కావాలన్నారు.. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ₹.45 కోట్లతో అందుకోసం కూడా మంజూరు చేస్తున్నాం. మల్లయ్యపాలెం లే అవుట్‌లో ఇంటర్నల్‌ రోడ్డు కోసం మరో ₹.9 కోట్లు కావాలన్నారు. అదీ మంజూరు చేస్తున్నాం.
అంతే కాకుండా గుడివాడ మున్సిపాల్టీలో ఇంటర్నల్‌ సీసీ రోడ్లు . అభివృద్ధి పనులను ₹ 26 కోట్లతో శంకుస్ధాపన చేశాం. కృష్ణా జిల్లాలో ₹.750 కోట్లతో జలజీవన్‌ మిషన్‌ కింద చేపడుతున్న పైప్‌లైన్‌ ప్రాజెక్టులో ₹160 కోట్లతో గుడివాడ ప్రాంతాల్లో తాగునీటి అవసరాల కోసం కేటాయిస్తూ.. ఈ పనులకూ శంకుస్ధాపన చేసాం. వీటన్నింటి ద్వారా ఈ ప్రాంతం ప్రజలకు మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రసంగం ముగించారు.