గుడివాడకు వెన్నుపోటు అల్లుడు –
ఆ పెద్దమనిషి ఒక్కరికి ఇల్లు పట్టా ఇవ్వలేదు !

వైయస్ జగన్మోహన్ రెడ్డి !


J. SURENDER KUMAR,

ఇదే గుడివాడకు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన అల్లుడు ఉన్నాడు. ఆ పెద్దమనిషి తాను గుడివాడ అల్లుడు అని చెప్పుకుంటూ ఉంటాడు. తన 14 ఏళ్ల పాలనలో ఇక్కడి పేదలకు ఎన్ని ఇళ్లపట్టాలు ఇచ్చాడో చూస్తే.. కనీసం ఒక్కరికి అంటే ఒక్కరికి కూడా ఇళ్లప్టటాలిచ్చిన దాఖలాలు లేవు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.
కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ పరిధిలో  టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు శుక్రవారం పంపిణీ చేసిన సందర్భంలో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు ఆయన మాటల్లో..

ఒక్క పేదవాడికి కనీసం ఒక్క సెంటు కూడా ఈ పెద్దమనిషి చంద్రబాబు ఇవ్వలేదు. ఒక ఇళ్లూ కట్టించి ఇవ్వలేదు. ఒక సెంటు స్ధలం కూడా ఇవ్వలేదు.  బాబు పాలనకు భిన్నంగా మనం పేదల ప్రభుత్వంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నాం.
👉 పేదల వ్యతిరేకి బాబు..
రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆలోచన చేయాల్సిన విషయాలను మీ అందరితో పంచుకుంటున్నాను. ప్రతి ఒక్కరినీ ఆలోచన చేయమని కోరుతున్నాను. నాలుగేళ్లలో మన ప్రభుత్వం ఇన్ని లక్షల ఇళ్లు ఎలా కట్టగలిగింది. మీ బిడ్డ ప్రభుత్వంలో నాలుగేళ్లలో 30 లక్షల ఇళ్ల స్ధలాలు ఇవ్వగలిగింది ? ఆలోచన చేయాలి.
మరి ఇదే పనిని 30 ఏళ్ల క్రితమే సీఎం అయిన ఈ బాబు, మూడు సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ఈ బాబు, 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ఎందుకు చేయలేకపోయాడు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.కారణం  బాబు పేదల వ్యతిరేకి కాబట్టి చేయలేదు. 300 అడుగుల టిడ్కో ఇంటిని మన ప్రభుత్వం రూ.1కే మన అక్కచెల్లెమ్మలకు ఎలా ఇవ్వగలుగుతుంది? మరి ఇదే పనిని 30 ఏళ్ల క్రితం సీఎం అయిన బాబు, 14 ఏళ్లు సీఎంగా పరిపాలన చేసిన బాబు ఎందుకు చేయలేకపోయాడు ? ఆలోచన చేయండి. కారణం బాబు పేదల వ్యతిరేకి కాబట్టే చేయలేదు.

👉 బాబు తన బినామీ భూముల రేట్ల కోసం అడ్డుపడ్డాడు…

  అమరావతిలో పేదలకు ఇళ్లపట్టాలిస్తే అక్కడ డెమోగ్రఫిక్‌ ఇంబ్యాలన్స్‌ వస్తుంది.. అంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని.. ఏకంగా కోర్టుల్లో కూడా నిస్సిగ్గుగా వాదించారు.
అయినా కూడా అదే అమరావతిలో 50 వేల మంది అక్కచెల్లెమ్మల కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడి  నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నా నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాం.

👉 ఇదే పనిని ఈ బాబు ఎందుకు చేయలేదని ఆలోచన చేయాలి ? 

ప్రభుత్వం 4 సంవత్సరాల కాలంలో రూ. 2.16 లక్షల కోట్లు నేరుగా బటన్‌ నొక్కి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాం. మరి ఇదే పనిని బాబు ఎందుకు చేయలేదన్నది ఆలోచన చేయండి, కారణం బాబు పేదల వ్యతిరేకి కాబట్టే.

👉 4 ఏళ్లలో …..

అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు పింఛన్‌ రూపంలో రూ. 72 వేల కోట్లు ఇవ్వగలిగాం. రైతన్నలకు రైతు భరోసాగా రూ. 31 వేల కోట్లు ఇవ్వగలిగాం.
అమ్మ ఒడిగా అక్కచెల్లెమ్మలకు పిల్లల బాగోగుల కోసం రూ. 19,674 కోట్లు ఇవ్వగలిగాం. ఆసరాగా అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్లమీద నిలబడాలని 4 ఏళ్లలో ఇంకో రూ. 19,178 కోట్లు ఇవ్వగలిగాం. చేయూతగా నా అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడేందుకు 4 ఏళ్లలో రూ. 14,129 కోట్లు ఇవ్వగలిగాం. నా అక్కచెల్లెమ్మల పిల్లలు బాగా చదవాలి, ఎదగాలని విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ. 14,913 కోట్లు ఇవ్వగలిగాం. ఈ నాలుగేళ్లలో సున్నావడ్డీ, ఈబీసీ నేస్తం, చేదోడు, కాపునేస్తం, తోడు, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, లా నేస్తం, ఉచిత పంటలబీమా, వాహనమిత్ర, పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీని ఇంకా మెరుగుపరుస్తూ ఆరోగ్యఆసరాతో పాటు చివరకి అగ్రిగోల్డ్‌ బాధితులకు కూడా మేలుచేయడంతో పాటు ఈకార్యక్రమాలన్నీ మనం మాత్రమే నాలుగేళ్లలో అమలు చేసిన పథకాలు.
మరి ఇవన్నీ 30 ఏళ్ల క్రితమే సీఎం అయిన ఈ బాబు, 14 సంవత్సరాలు సీఎం కుర్చీలో కూర్చున్నఈ బాబు, 3 సార్లు సీఎం అయిన ఈ బాబు ఎందుకు చేయలేదు ? బాబు, పేదల వ్యతిరేకి కాబట్టే చేయలేదు. ఈ రోజు రాష్ట్రంలో పేదలకు ఇళ్లు కట్టే ఉద్దేశం చంద్రబాబుకు ఎలాగూ లేదు. 

👉ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి,

మరో పది నెలల్లో ఎన్నికలు ఉన్నాయనేసరికి మాత్రం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఈరోజు ఇళ్లు కట్టుకుంటానని పర్మిషన్‌ కోసం నన్ను అడుగుతున్నాడు. తాను కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిచి 34 సంవత్సరాలు అయిన తర్వాత 75 ఏళ్ల వయస్సున్న ఆయన ఈ రోజు ఎన్నికలు మరో పదినెలల్లో ఉన్నాయన్న నేపధ్యంలో కుప్పంలో ఇళ్లు కట్టుకుంటానని పర్మిషన్‌ అడుగుతాడు.  కుప్పంలో మైకు పట్టుకొని ఇంకో చాన్స్‌ ఇవ్వండి చేసేస్తా అంటాడు. ఇంకో ఛాన్స్‌ ఇవ్వండి ఇంకా ఎక్కువ చేస్తాను, ఇంకో ఛాన్స్‌ ఇవ్వండి మీ ప్రతి ఇంటికి 1 కేజీ బంగారం ఇస్తాను. మీ ప్రతి ఇంటికి బెంజ్‌ కారు ఇస్తా అని ఈ మధ్య కాలంలో ఎన్నికల దగ్గరపడేసరికి మోసం చేయడానికి బయలుదేరాడు.


👉చేసిన మేలులేదు అయినా ఇంకో ఛాన్స్‌ అంటూ..


ఈ పెద్ద మనిషి నాకు ఇంకో ఛాన్స్‌ ఇవ్వండి ఇది చేస్తాను, అది చేస్తాను అంటాడే  తప్ప సీఎంగా ఉన్న ఆరోజుల్లో మీ ప్రతి ఇంటికీ ఈ మంచి నేను చేశాను కాబట్టి నాకు ఓటేయండని అడగలేడు. మీ ప్రతి ఇంటికి డీబీటీ రూపంలో ప్రతి అక్కచెల్లెమ్మకు ఇంత ఇచ్చాను కాబట్టి నాకు ఓటేయండి అని అడగలేదు. ప్రతి పేద సామాజిక వర్గానికి తాను సీఎంగా ఉంటూ ఈ మేలు చేశాను అని కానీ, తాను పిల్లలకు ఈ మంచి చేశాను కాబట్టి నాకు ఓటువేయండి అని అడగడం లేదు. ఈ పెద్ద మనిషి తాను సీఎంగా ఉన్నప్పుడు అవ్వాతాతలకూ ఫలానా మంచి చేశాను కాబట్టి నాకు ఓటేయండని అడగడం లేదు. కారణం మంచి చేసిన చరిత్ర ఈ పెద్దమనిషి చంద్రబాబుకు లేనేలేదు. అడిగే నైతికత కూడా ఈ పెద్దమనిషికి లేదు.


👉 అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే…


అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే లంచాలకు తావివ్వకూడదని, వివక్షకు చోటులేకుండా చేయాలని వాలంటీర్‌ వ్యవస్ధ, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్ధతోను తీసుకొచ్చాం. ఆర్బీకేలను, విలేజ్‌ క్లినిక్‌లను గ్రామస్ధాయిలోకి తీసుకొచ్చాం. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చాం. నాడు నేడుతో రూపురేఖలు మారుతున్న స్కూళ్లను తీసుకొచ్చాం. గ్రామస్ధాయిలోనే ప్రస్ఫుటంగా మార్పులు దిశగా అడుగులు వేశాం.
కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది మనం. కొత్తగా మరో 17 మెడికల్‌ కాలేజీలు కడుతున్నాం. కొత్తగా మరో నాలుగు సీపోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఫిషింగ్‌ హార్భర్లు, ఫిషింగ్‌ సెంటర్లు కడుతున్నది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. భావితరాల కోసం విద్యావ్యవస్ధ కానివ్వండి, అక్కచెల్లెమ్మల సాధికారత కోసం కానీ, రైతన్నల సంక్షేమం కోసం, సామాజిక వర్గాలకు న్యాయం చేయడం కోసం, వైద్యం అందించడం కోసం కానీ, అన్ని రంగాలలో విప్లవాత్మక మార్పులు ప్రతి అడుగులోనూ గ్రామ స్ధాయిలో కనిపించేట్టు ఒక బాధ్యతతో మనసు పెట్టి చేసిన ప్రభుత్వం కూడా మనదే.
మనం ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోను ఒక ఖురాన్,భగవద్గీత, బైబిల్‌ గా భావించాం. ఏకంగా మేనిఫెస్టోలో చెప్పిన మాటలను  99 శాతం నెరవేర్చి ప్రతి అక్కచెల్లెమ్మల వద్దకు వెళ్లి మీకు మంచి జరిగిందా ? లేదా ?  అనే నైతికత మనది. 
👉 మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన
ఆ పెద్ద మనిషి చంద్రబాబు…

ప్రతిసారీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టకే పరిమితం చేశాడు. తేడా గమనించండి.
మనం ఎందుకు ఇంత మంచి చేయగలుగుతున్నాం. బాబు చేయలేకపోయాడు కారణం… మనకు పేదల కష్టం, వారి గుండె చప్పుడు తెలుసు కాబట్టి. మన పార్టీ ఆ పేదవాడి హృదయం నుంచి పుట్టింది కాబట్టి… చేయగలుగుతున్నాం. వాళ్లది పెత్తందార్ల పార్టీ, గజదొంగల ముఠా కాబట్టి వాళ్లు చేయలేదు. మనం దేవుడిని ప్రజలను నమ్ముకుంటే.. వారు చిత్తులని, పొత్తులని, ఎత్తులని దుష్ట చతుష్టయాన్ని నమ్ముకున్నారు. తేడా గమనించండి.

👉 40 ఏళ్ల రాజకీయ జీవితం

తర్వాత కూడా ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఏమాత్రం కూడా లేని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, రెండు పక్కలా కూడా రెండు పార్టీలు ఉంటే తప్ప లేచి నిలబడలేని ఈ చంద్రబాబు మనకు ప్రత్యర్ధి అట. 175 నియోజకవర్గాల్లో 175 మంది క్యాండిడేట్లను కూడా పెట్టలేని ఈ వ్యక్తి మనకు ప్రత్యర్ధి అట. మరో వంట రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాల తర్వాత కూడా తాను చంద్రబాబు కోసమే పుట్టానంటూ.. తన జీవితమే బాబు కోసం త్యాగమంటూ, తన వ్యాన్‌ను చూసి మురిసిపోతూ, ఇక  తాను కూడా ఎమ్మెల్యే అవుతానని, తనను ఎవరు ఆపుతారో చూస్తానని అంటున్న ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు మరో వంక. ఈ చంద్రబాబుతో పాటు అధికారాన్ని పంచుకుని ఆ అధికారంతో రాష్ట్రాన్ని, రాష్ట్రంలో ఉన్న పేదలను ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లతో కలిసిన గజ దొంగల ముఠా దోచుకుంది. 

👉 నాకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5,

దత్తపుత్రుడు అండగా ఉండకపోవచ్చు.
వీళ్లకి అధికారం  ఎందుకు కావాలి అంటే కలిసికట్టుగా రాష్ట్రాన్ని దోచుకునేందుకు, పంచుకునేందుకు, తినుకునేందుకు అధికారం కావాలి. ఈ తోడేళ్ల గుంపు నుంచి మీ బిడ్డ ఒంటరిగానే ఉన్నాడు.  వీళ్లెవరూ మీ బిడ్డకు తోడుగా లేరు. వీళ్ల మాదిరిగా హంగూ ఆర్భాటం లేకపోవచ్చు. మీ బిడ్డకు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు. ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు. టీవీ 5, దత్తపుత్రుడు అండగా ఉండకపోవచ్చు. ఇంకా చిన్నా చితగా పార్టీలు తోడుగా ఉండకపోవచ్చు. కానీ మీ బిడ్డ వాళ్లను నమ్ముకోలేదు. మీ బిడ్డ రాజకీయాల్లోకి వచ్చింది, రాజకీయాలలో నిలబడంది వాళ్లను నమ్ముకుని కాదు.

👉 మీ బిడ్డ మిమ్నల్ని, దేవుడ్నే నమ్ముకున్నాడు !

మిమ్నల్ని, దేవుడి దయనే మీ బిడ్డ నమ్ముకున్నాడు. ఇంతమంది తోడేళ్లన్నీ ఏకమైనా కూడా మీ బిడ్డ భయపడడు. కారణం ఒక్కటే మీ బిడ్డ చెప్పేది ఒక్కడే, అడిగేది, మీ అందరినీ కోరేది ఒక్కటే.  అబద్దాలన్నీ నమ్మకండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా ? లేదా ?  అనేది ఒక్కటే కొలమాణంగా తీసుకోండి. మంచి జరిగుంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా మారండి. మంచి జరిగితే మీ బిడ్డకు ఓ అన్నగా, తమ్ముడిగా, అక్కగా, తాతగా మీరే నిలబడండి. దేవుడి దయ వల్ల ఇంకా మంచి చేసే రోజులు రావాలని, ప్రతి అక్కచెల్లెమ్మ కుటుంబానికి ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇవాల జరుగుతున్న మంచి కార్యక్రమం ద్వారా మీ అందరికీ అభినందనలు