జగిత్యాల డిసిసి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్
J.SURENDER KUMAR,
ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయి, న్యాయం చేయాలి అంటూ హైకోర్టు లో వేసిన నా పిటిషన్ కోర్టు ఆమోదించిందని, నా పిటిషన్ ను తిరస్కరించాలంటూ హైకోర్టు, సుప్రీంకోర్టుల లో మంత్రి కొప్పుల ఈశ్వర్ వేసిన పిటిషన్లను రెండు కోర్టులు కూడ తిరస్కరించాయి, అని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆన్నారు.
ధర్మపురి నియోజకవర్గ ఎన్నికల రీ కౌంటింగ్ పిటిషన్ పైన మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన ఆరోపణల పై శనివారం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఓట్ల లెక్కింపులో అధికారులు అక్రమాలకు పాల్పడి ఓట్ల రీకౌంటింగ్ కోసం తాను చేసిన అభ్యర్థనను పట్టించుకోకుండా ఫలితాలు ప్రకటించారు. న్యాయం చేయాలని లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.
లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలు ఇలా ఉన్నాయి.
👉 రీకౌంటింగ్ చెయ్యమని హై కోర్టులో పిటిషన్ నేను దాఖలు చేసినప్పుడు రీకౌంటింగ్ చేయ్యవద్దని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎందుకని హైకోర్టులో పిటీషన్ వేశారు.
👉 హైకోర్టు పిటిషన్ ను తిరస్కరించినప్పుడు 6 గురు న్యాయ వాదులను పెట్టీ మరీ సుప్రీం కోర్టులో రీ కౌంటింగ్ చెయ్యవద్దని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిటిషన్ దాఖలు చేశారు..
👉 న్యాయంగా, ధర్మంగా, గెలిచి ఉంటే మంత్రి కొప్పుల ఈశ్వర్ రీకౌంటింగ్ చేయవద్దని సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఏముంది.
👉 ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఫామ్ 22 నివేదిక ప్రకారం 2018 ఎన్నికల్లో ధర్మపురి అసెంబ్లీ స్థానానికి పోలైన మొత్తం ఓట్ల శాతం…79.96%
👉 RTI చట్టం ద్వారా ధరఖాస్తు చేసుకున్న అనంతరం ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఫామ్ 22 నివేదిక ప్రకారం 2018 ఎన్నికల్లో ధర్మపురి అసెంబ్లీ స్థానానికి పోలైన ఓట్ల శాతం..80.02%
👉 ఒక జిల్లా అధికారుల ఆధీనంలో ఉండవలసిన స్ట్రాంగ్ రూం తాళాలు ఎలా మాయమయ్యాయి.
👉 స్ట్రాంగ్ రూం తాళాలు పగలగొట్టిన అనంతరం లోపల ఉన్న ట్రంకు పెట్టెల్లో కేవలం కొన్నిటికి మాత్రమే తాళాలు వేసి ఉండి మిగితా ట్రంకు పెట్టెలకు తాళాలు వెయ్యకుండా ఉన్నాయి.
👉 ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి ముఖ్యమైన 17ఏ మరియు 17 సి కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్న వాటికి సీల్ వెయ్యకుండా వదిలేశారు
👉 కౌంటింగ్ సమయంలో రికార్డ్ చేసిన విడియో ఫుటేజ్ మరియు సి.సి టివి ఫుటేజ్ లు ఎలా మాయమయ్యాయి.
👉 స్ట్రాంగ్ రూంలో భద్రపరచాల్సిన కౌంటింగ్ కి సంబంధించిన విడియో ఫుటేజ్ లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి..
👉 హై కోర్టు లో మంత్రి కొప్పుల ఈశ్వర్ రికౌంటింగ్ చేయవద్దని మీరు వేసిన ఎన్నికల పిటిషన్ ను తిరస్కరించి, నా అభ్యర్థనను స్వీకరించడానికి సంబంధించిన 50 పేజీల జడ్జిమెంట్ ని ఇవ్వడం జరిగింది..
👉 కోర్టులో ఉన్న రీ కౌంటింగ్ పిటిషన్ కి సంబందించిన 17ఏ,17సి కి సంబందించిన డాక్యుమెంట్స్ మరియు సి. సి టివి ఫుటేజ్ ని RTI ద్వారా అప్పటి జిల్లా కలెక్టర్ రవి ని కోరడం జరిగింది..
👉 RTI కింద దరఖాస్తు చేసుకున్నప్పుడు వర్జినల్ కాపీస్ కాకుండా దాని డూప్లికట్ కాపీస్ ఇవ్వడం జరుగుతుంది. సి.సి టివి ఫుటేజ్ నా దగ్గరే ఉంది అని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపణ చెయ్యడం చాలా బాధాకరం.
👉 కౌంటింగ్ సమయంలో సంబంధం లేని ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కౌంటింగ్ హాల్లో కి రావడానికి కారణం ఏమిటి ? జాయింట్ కలెక్టర్, ఆర్డీవో కౌంటింగ్ హాల్లో కి రావడానికి కారణం ఏమిటి..
👉 13 రౌండ్ల వరకు ఆధిక్యంలో ఉన్న నేను చివరి 14 రౌండ్లో కూడా వి.వి ప్యాడ్స్ లెక్కింపు చెయ్యాలని మాత్రమే కోరడం జరిగింది .
👉 కౌంటింగ్ సమయంలో రికార్డ్ చేసిన విడియో ఫుటేజ్, సి. సి టివి ఫుటేజ్ లను సంబంధిత డాక్యుమెంట్స్ లను కోర్టుకు సమర్పించకపోతే అప్పటి రిటర్నింగ్ అధికారి పైన కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చెయ్యడం జరిగింది..
👉 ఒక మంత్రి కి సంబందించిన ఎన్నికల పిటిషన్ కోర్టులో ఉంటే స్ట్రాంగ్ రూంకి సంబందించిన తాళాలు మిస్సింగ్ అవ్వడం పైన ఉన్న మిస్టరీ ఏమిటి
👉 రీ కౌంటింగ్ చెయ్యవద్దని హై కోర్టులో సుప్రీం కోర్టులో మీరే ఐ.ఏ లు వేసి మళ్ళీ మీరే నేను ఐ.ఏ లు వేసి తీర్పును ఆలస్యం చేస్తున్నమని నా మీద అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు.
👉 తాళాలు మాయమవ్వడం పట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రమేయం ఏమి లేకపోతే ఒక మంత్రి హోదాలో మీరు తాళాలు మాయమవ్వడం పట్ల విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు..
👉 ఢిల్లీ నుండి వచ్చిన ఎన్నికల కమిషన్ అధికారులు ఎన్నికల కౌంటింగ్ విషయంలో అధికారులు నిబందనలు ఎక్కడ పాటించలేదని నివేదికను కోర్టుకు సమర్పించడం జరిగింది.
👉 మంత్రి ఈశ్వర్ నా పైన పరువు నష్టం దావా వేస్తానని అంటున్నారు..ఒక దళిత మంత్రిగా కొప్పుల ఈశ్వర్ కి ఒక్కటే చెప్తున్నాం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావులు స్వయంగా మిమ్మల్ని పక్కకు నెట్టివెయ్యడం జరిగింది., ముందు వాళ్ళ మీద పరువు నష్టం దావా వెయ్యండి
👉 మంత్రి కొప్పుల ఈశ్వర్ తేదీ ,సమయం చెప్పండి నా తరపు న్యాయవాదులను మీ తరపు న్యాయవాదులను తీసుకువద్ధాం ఏ చర్చకు అంటే ఆ చర్చకు సిద్దం..
👉 కాంగ్రెస్ పార్టీ హయాంలో నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు టి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి కూడా మీకు వర్క్స్ ఇవ్వడం జరిగింది..కానీ ఇప్పుడు మీరు నా మీద రాజకీయంగా వాడే భాష మీ స్థాయిని దిగజార్చే విధంగా ఉంది.
ఈ సమావేశంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంఘన భట్ల దినేష్, గొల్లపల్లి మండల పార్టీ అధ్యక్షులు నిశాంత్ రెడ్డి, వెల్గటూర్ మండల పార్టీ అధ్యక్షులు శైలేందర్ రెడ్డి, ధర్మారం మండల పార్టీ అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, పెగడపల్లి మండల పార్టీ అధ్యక్షులు రాములు గౌడ్, బుగ్గారం మండల పార్టీ అధ్యక్షులు సుభాష్, పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.