హైదరాబాదులో ఉగ్రవాద కోచింగ్ ? గుజరాత్ ATS వద్ద కీలక సమాచారం !

J.SURENDER KUMAR,

ఈ నెల మొదటి వారంలో గుజరాత్ పోరుబందర్ సముద్ర తీరంలో యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ (ATS) కు పట్టుబడిన అనుమానితులు ఇచ్చిన కీలక సమాచారం మేరకు హైదరాబాద్ లో , అనుమానిత ప్రాంతాల్లో గత రెండు రోజులుగా ATS బలగాలు దాడులు చేస్తూ అనుమానితులను అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

శ్రీనగర్ కు చెందిన ఉబేదా నజీర్, గుజరాత్ కు చెందిన సమీరా భాను, హసన్ హయాత్ షా, మహమ్మద్ అజీమ్ షాప్, లు ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ కొరస్థాన్ ప్రావిసన్స్ ‘ లో చేరడానికి ఇరాన్ గుండా ఆఫ్ఘనిస్తాన్ కు.. వెళుతున్నట్టు వారి నుంచి కీలక సమాచారం సేకరించిన గుజరాత్ ATS బలగాలు హైదరాబాద్, గోదావరిఖని దాడులకు శ్రీకారం చుట్టి పలువురిని అదుపులో తీసుకున్నట్టు సమాచారం.
హైదరాబాద్ అమీర్‌పేటలో గుజరాత్ ఏటీఎస్ బుధవారం నాలుగు కోచింగ్ సెంటర్లలో తనిఖీలు చేపట్టింది, సీసీ ఫుటేజీ పరిశీలించారు. అమీర్‌పేటలోని ఓ కోచింగ్ సెంటర్‌లో సాఫ్ట్‌వేర్‌ ట్రైనర్‌గా పని చేస్తున్న జావెద్.. కోచింగ్ మాటున ఉగ్రశిక్షణ ఇచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జావెద్ కార్యకలాపాలపై ఏటీఎస్ ఆరా తీస్తోంది. హైదరాబాద్ పాతబస్తీతో పాటు రామగుండంలో ఏటీఎస్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఇటీవల పోరుబందర్‌లో పట్టుబడ్డ ఐఎస్‌కేపీ ఉగ్రవాదులతో వీరికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. పట్టుబడ్డ ఐదుగురు ఉగ్రవాదుల్లోని ఒక మహిళకు హైదరాబాద్ పాతబస్తీకి కాలపత్తర్ మెడికల్ షాప్ నిర్వాహకుడు. ఫసీ ఖాద్రి అనే వ్యక్తితో సంబంధాలు ఉన్నట్లు నిర్ధారించారు.
రామగుండంలో సాఫ్ట్‌వేర్ ట్రైనర్ జావీద్ ఇంట్లో తనిఖీలు చేపట్టిన ఏటీఎస్… జావీద్‌తో పాటు అతని కుమార్తె సుబేరాను అదుపులోకి తీసుకున్నారు. పాతబస్తీ వాసి ఫసీతో సంబంధాలపై ఆరా తీయాలని నిర్ణయించారు. శ్రీనగర్‌కు చెందిన నాసీర్‌, హయత్‌, అజీమ్‌లతో ముఠా సభ్యులను సూరత్‌కు పిలిచిన సుబేరా భాను.. ఉగ్ర కార్యక్రమాలకు పాల్పడుతున్న ఫసీని అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.