సాగర్ జీ మాటల వెనక మర్మం ఏమిటో ?
J..SURENDER KUMAR,
చెన్నమనేని విద్యాసాగర్ రావు, @ సాగర్ జీ బిజెపి పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు, ప్రముఖ న్యాయవాది, కేంద్ర హోం మంత్రిగా, దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్ర గవర్నర్ గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, అసెంబ్లీలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ గా రాజకీయా రంగంలో, రాజ్యాంగ పరిమితులను అవపాసన పట్టి అపార అనుభవం గల అపరచానిక్యుడిగా సాగర్ జీ కి గుర్తింపు ఉంది. శుక్రవారం కరీంనగర్ పట్టణంలో మీడియా సమావేశంలో ఆయన తన వ్యక్తిగత అభిప్రాయం అంటూనే ‘ హైదరాబాద్ దేశానికి రెండవ రాజధానిగా ఉండాలి అంటూ’ స్పష్టం చేశారు. అంతేకాదు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మనుమడు ఇటీవల హైదరాబాద్ లో కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు అంటూ వివరించారు. దీనికి తోడు రాజ్యాంగంలో ‘ షెల్ ‘ హైదరాబాద్ అనే పదం రెండవ రాజధాని గా హైదరాబాద్ అని పేర్కొనబడినట్టు సాగర్ జీ స్పష్టం చేయడం, ఆషా మాసి వ్యాఖ్యానం కాదని, రాష్ట్ర , జాతీయ రాజకీయ పార్టీలలో చర్చ మొదలైంది. సాగర్ జీ వ్యాఖ్యానం వెనుక మర్మ్మం ఏమిటో ? హైదరాబాద్ రెండవ రాజధానియా ? లేక మరో పది సంవత్సరాల కాలం పాటు ఏపీ, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందా ? అనే చర్చ కూడా నెలకొంది.
తెలంగాణలో పాగా వేసి, కాషాయ జెండా ఎగురవేయాలని. ఉత్సాహంగా ఉరకలు వేస్తున్న బిజెపి కి కర్ణాటక ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చిందనేది జగమెరిగిన సత్యం. ఆరు నూరైనా. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కృత నిశ్చయంతో ఉన్న బీజేపీ అధిష్టానం గత కొంతకాలంగా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల క్రితం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని అమిత్ షా, నడ్డా లు ఢిల్లీ కి పిలిచి చర్చించడం, చర్చల వివరాలు బయటకు రాకపోవడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, 14 నుంచి ఏపీలో ‘ వారాహి ‘ రాజకీయ యాత్ర నిర్వహిస్తున్న విషయం విదితమే. లోకేష్ , చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటనల్లో, బహిరంగ సభలలో. జనసేన, టిడిపి, పోత్తుల అంశాలు ఎవరు ప్రకటించలేదు, ప్రస్తావించడం లేదు.
ముక్కోణపు పొత్తుల నేపథ్యంలో..
ఏపీలో వ్యతిరేక ఓటు చీల్చనివ్వనంటూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి అధినేత బాబుతో పలుమార్లు చర్చలు జరపడం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మా మిత్రపక్షం, కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పలుమార్లు వివరించడం తెలిసిందే. పవన్ స్నేహాన్ని విడవలేక, బాబు పార్టీతో స్నేహం చేయలేక మధ్య మార్గంగా హైదరాబాద్ రెండవ రాజధాని అనే అంశం బిజెపి అధిష్టానం తెరపైకి తెచ్చింది అనే చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ‘ నన్ను నమ్మండి ,నాకు సీఎం పదవి ఇవ్వండి మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని సేవ చేస్తానంటూ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడడం, రానున్నది తెలుగుదేశ ప్రభుత్వ మే అంటూ చంద్రబాబు ప్రకటనలు చేయడం, లోకేష్ సైతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు అంటూ తన యువ గళం యాత్రలో పేర్కొనడం గమనహారం. వీరి ప్రకటనల పరంపరలో జనసేన, టీడీపీల మధ్య పొత్తు ఉండకపోవచ్చునే భావం, చర్చ నెలకొంది.
హైదరాబాదులో సీమాంధ్ర ఓట్లపై కన్నేసిన టిడిపి, జనసేన, బిజెపి లో కొందరు నేతలు ‘హైదరాబాద్ ఫార్ములా ‘ ను బిజెపి అధిష్టానం ముందు ఉంచినట్టు చర్చ. ఏపీ రాజధాని నిర్మాణ అంశం అగమ్య గోచరంగా మారడం, మూడు రాజధానుల రాజకీయ వివాదం నేపథ్యంలో హైదరాబాద్ రెండవ రాజధాని, ఫార్ములా తెరపైకి వచ్చినట్లు చర్చ. ఏపీలో బీఆర్ఎస్, సిపిఐ, ప్రజాశాంతి, సిపిఎం, కాంగ్రెస్, తదితర పార్టీలు పోటీలో ఉంటే అధికార పార్టీ వైయస్సార్సీపి వ్యతిరేక ఓట్లు చీలవా? అనే అంశం కూడా చర్చలో వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలో ఆకు ప్రభుత్వంతో లెఫ్ట్నెంట్ గవర్నర్ వివాదం, సుప్రీంకోర్టు లో పిటిషన్లు. తెలిసినవే. త్వరలో జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో, కాంగ్రెస్, బీ ఆర్ఎస్, బిజెపి నువ్వా ? నేనా? అనే తరహాలో పోటీ పడనున్న నేపథ్యంలో. ఒకవేళ కాంగ్రెస్, లేదా బీఆర్ఎస్ పార్టీలు విజయం సాధిస్తే హైదరాబాద్ రాజధాని అంశంతో చెక్ పెట్టే యత్నంలో భాగం కావచ్చు అనే చర్చ రాజకీయ విశ్లేషకులు జరుగుతున్నది.
అధిష్టానమే పలికించిందా ?
రాష్ట్రంలో రాజకీయాలను శాసించే బలమైన కెసిఆర్ సామాజికవర్గానికి, చెందిన సాగర్ జీ కి ప్రజలతోపాటు పార్టీ క్యాడర్ లోను, ఆయన సామాజిక వర్గం లో నేటికీ మంచి పట్టు ఉంది. 1980 నుంచి 2014 వరకు ఆయన సామాజిక వర్గానికి రాజకీయంగా, మిగతా అన్ని రంగాల్లోనూ వారికి కి ‘ గాడ్ ఫాదర్ ‘ గా సాగర్ జీ కి గుర్తింపు ఉంది. నాటీ ఆయన క్యాడర్ లో కొందరు ప్రస్తుతం కీలక నాయకులు, ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో బిజెపి కేంద్ర నాయకత్వం సాగదీస్తూ ఈ మాటలు పలికించిందా ? అనే చర్చ కూడా ఉంది.
రెండు రాష్ట్రాల తీర్మానం సాగర్ జీ హాయంలో !
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న సాగర్ జీ హయంలో కాకినాడలో జరిగిన బిజేపి కార్యవర్గ సమావేశంలో “ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు” తీర్మానం చేసి రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ఆయన బిజెపి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిన కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో, వివిధ రాజకీయ పార్టీలతో పొత్తులు, పెట్టుకుని బిజెపి పార్టీకి 12 అసెంబ్లీ సీట్లను, 7 పార్లమెంటు సీట్లను గెలిపించుకుని క్రియాశీల రాజకీయ చతురతను, నిర్వహించిన తీరు నేటికీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా నిలిచింది.. ‘ సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం’ మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతులతో ముడిపడి ఉన్న పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు ప్రాణహిత-చేవెళ్ల, ఇచ్చంపల్లి, తదితర ప్రాజెక్టులు ఎత్తిపోతల పథకాల ప్రతిబంధకాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రివర్గ సభ్యులతో, అప్పటి మహారాష్ట్ర సీఎం , ఫండవిస్, మహారాష్ట్ర రాజ్ భవన్ లో జరిగిన చర్చలు సఫలం కావడం లో సాగర్ జీది కీలకపాత్ర అనే చర్చ ఉంది, కాకతాళీయంగా చర్చలు జరిగిన రోజు ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు అదే కావడంతో రాజ్ భవన్ లో కెసిఆర్ పుట్టినరోజు వేడుకలను నాడు సాగర్ జి నాడు ఘనంగా జరిపారు.
నమ్మిన బంటు !
“మీసా” చట్టం నమోదు అరెస్ట్ !
1975 సంవత్సరంలో దేశంలో విధించిన ఎమర్జెన్సీ నీ బహిరంగంగా వ్యతిరేకిస్తూ, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన సాగర్ జీని, పోలీసులు కరీంనగర్ పరేడ్ గ్రౌండ్లో, జనం ముందు లాఠీలతో, తుపాకీ బాయినెట్స్ తో చితకబాది తీవ్ర రక్త గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న ఆయన పై “మీ సా” కేసు పెట్టి అరెస్టు చేసి వరంగల్ జైల్లో సంవత్సరకాలం నిర్బంధించారు.
ప్రజాక్షేత్రంలోను…
1977 లో కేంద్రంలో ఏర్పడిన జనతా పార్టీకి కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన సాగర్ 1980 లో జనతా పార్టీ నుంచి జనసంఘ్ నాయకులు విడిపోయి భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసిన సందర్భంలో ఆయన బిజెపిలో చేరి, జిల్లా తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలలో పార్టీ విస్తరణకు కృషి చేశారు. నక్సలైట్లకు, ఉగ్రవాదులకు, కొరకరాని కొయ్యగా మారి టార్గెట్ అయ్యారు. 1977లో తొలిసారి జిల్లాలోని మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. 1985 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు లో భాగంగా మెట్టుపల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 372 స్వల్ప ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన సాగర్ జి..2004 ఎన్నికల వరకు ఓటమి ఓటమి ఎరుగలేదు. 1989 , 1994 అసెంబ్లీ ఎన్నికల్లో ను అదే నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, శాసనసభలో ఆ పార్టీ పక్ష నేతగా కొనసాగారు. 1998, 1999, పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి విజయం సాధించి, ప్రధాని వాజపేయి మంత్రివర్గంలో, మంత్రి పదవులు అలంకరించారు. 2004 – 2006 పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల ఎమ్మెల్యేగా, 2014లో కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004 నుంచి 2014 వరకు బిజెపి పార్టీ పక్షాన గోదావరి నది జలాల వినియోగం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పనుల కోసం పాదయాత్ర లు చేశారు. Jeeyar trust ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రలు ఏర్పాటు తదితర అంశాలలో. ట్రస్టుకు చేయూత నందించారు . సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మొట్టమొదట డిమాండ్ చేసిన ఘనత ఆయనదే.
పటేల్ విగ్రహ కమిటీ కన్వీనర్ గా !
నాటి గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రంలో తలపెట్టిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ప్రతిష్టాపన అవసరమైన ఇనుము సేకరణకు ఉమ్మడి రాష్ట్రంలో బిజెపి పార్టీ పక్షాన ఏర్పాటైన కమిటీకి సాగర్ జీ నీ ఆ పార్టీ అధినాయకత్వం కన్వీనర్ గా నియమించింది. బిజెపి పార్టీ అగ్ర నాయకులు వాజ్ పెయ్, అద్వానీ ,మురళీ మనోహర్ జోషి, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ ,రాజ్నాథ్ సింగ్ ,వెంకయ్యనాయుడు ,. నరేంద్ర మోడీ అమిత్ షా ,ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ , జన సంఘం నాయకులతో పాటు పలువురు బీజేపీ పార్టీ వ్యవస్థాపక నాయకులతో స్నేహ సంబంధాలు ఉన్నాయి.
మహారాష్ట్ర గవర్నర్ గా!
నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా, ప్రముఖ న్యాయవాది గా, తన కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రాకుండా, తాను కొనసాగుతున్న పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా, ఎన్నికల్లో గెలిచినా, ఓడినా, పార్టీని వీడకుండా అధికార పార్టీలో చేరకుండా, క్రమశిక్షణ గల కార్యకర్తగా నాయకుడిగా, రాజ్యాంగం పై.అవగాహన, పట్టు మూడున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానం గల చెన్నమనేని విద్యాసాగర్ రావును ( సాగర్ జీ ) మోడీ ప్రభుత్వం 2014 , ఆగస్టు , 30న దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్ర గవర్నర్ పదవిని కట్టబెట్టి గౌరవించింది. దీనికితోడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించిన సాగర్ జీ కి గల బలమైన సామాజిక వర్గం, క్యాడర్ ను బిజెపి అగ్రనాయకత్వం పరిగణనలోకి తీసుకొని సరైన సమయంలో సాగర్ జీ తో రాజకీయ ఎత్తులు, తటస్థ చేరికలు తదితర అంశాల్లో కేంద్ర ,నాయకత్వం సాగర్ జీ జరిపిన చర్చల నేపథ్యంలోనే ‘ హైదరాబాద్ భారతదేశానికి రెండవ రాజధాని ‘ అనే ప్రకటన చేశారా ? మరో 10 ఏళ్ళు హైదరాబాద్ తెలంగాణ, ఏపీకి ఉమ్మడి రాజధానిగా కొనసాగనున్నదా ? అనే అధికారిక ప్రకటన పార్లమెంట్ సమావేశాల తర్వాత వెలువడుతుందా ?