27న ధర్మపురి పట్టణంలోఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.
3 మండలాలు 750 మంది విద్యార్థులకు..

విద్యార్థి దత్తత కార్యక్రమం – 2023


J.SURENDER KUMAR,

పేద విద్యార్థులకు సహాయపడాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన Student Adoption Program లో భాగంగా 27న మంగళవారం ఉదయం 10.00 గం.కి ధర్మపురి, బుగ్గారం, బీర్పూరు మండలాల్లోని 30 పాఠశాలల 750 మంది పేద విద్యార్థులకు ఉపాధ్యాయులు, మరియు దాతల సమక్షంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు), ధర్మపురి ప్రాంగణంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ చేయనున్నట్టు కన్వీనర్ డాక్టర్ గొల్లపెల్లి గణేష్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డా. బి. జగన్మోహన్ రెడ్డి జగిత్యాల జిల్లా విద్యాధికారి సముద్రాల రామానుజాచార్య , జగిత్యాల జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి డా. బి. నరేష్ , జగిత్యాల జిల్లా సంక్షేమశాఖాధికారి పాల్గొననున్నారని గణేష్ వివరించారు.
ఈ కార్యక్రమం విద్యాభిమానులు పాల్గొనాలని ప్రకటనలో కోరారు.