బిజెపి రాష్ట్ర నాయకురాలు శ్రావణి !
J.SURENDER KUMAR,
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీసీ ల పై కపట ప్రేమ చూపించి ముసలి కన్నీరు కార్చారని, ఎమ్మెల్యే బీసీల గురించి మాట్లాడడం సిగ్గు చేటు బీసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను తుంగలో తొక్కారని దానికి నిదర్శనం బీసీ రిజర్వేషన్ ప్రకారం కేటాయించిన రూరల్ ఎంపీపీ మరియు మున్సిపల్ చైర్మన్ పదవిలోనూ ఓసీలకు కట్టబెట్టి ఈరోజు బీసీలను అనగదొక్కి పరిపాలన కొనసాగిస్తూ నియంతల వ్యవహరిస్తున్నాడని, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ బోగశ్రావణి ఆరోపించారు.
బుధవారం జగిత్యాల లో ఆమె పాత్రికేయుల సమావేశం మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లను విమర్శించారు.
ఎమ్మెల్యే ముదిరాజ్ గంగపుత్రుల అభివృద్ధి గురించి మాట్లాడం సిగ్గుచేటని మీ పార్టీ యొక్క ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ముదిరాజులను అవమానపరిచినప్పుడు మీరు కనీసం ఖండించలేదని మీకు ముదిరాజుల గంగపుత్రుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు, అన్నారు.
కేంద్ర ప్రభుత్వం మత్స్య సంపద యోజన కింద మత్స్యశాఖ కార్మికులు ఆర్థికంగా నిలదొక్కుకోడానికి ఫిష్ పాండ్స్, టు వీలర్, ఫోర్ వీలర్లను సబ్సిడీ పై నిధులు కేటాయిస్తే వాటిని పేరు మార్చి మీరు పబ్బం గడుపుతున్నారని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక గౌడ కార్మికులు తమ బతుకులు బాగుపడతాయని ఆర్థికంగా బలపడలి అని భావిస్తే ప్రభుత్వ నడుపుతూ అడ్డగోలు వైన్స్ బార్లకు పర్మిషన్లు ఇచ్చి వాడవాడనా బెల్ట్ షాపులు పెట్టి గౌడ్ అన్నలను ఆర్థికంగా దెబ్బతిస్తుంటే ప్రభుత్వం కనీసం నియంత్ర చర్యలు చేపటడంలేదు,
ఏబీవీపీ విద్యారణ్య సమస్యల పైన బందుకు పిలుపునిస్తే దాన్ని విమర్శించడం నిజంగా సిగ్గు చేటు తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తుంటే నియంత్రించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది అని అన్నారు
ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు కరువైనయని ఎన్ని గురుకులాలు సొంత భవనాలు కలిగి ఉన్నాయని పాఠశాలలో కనీసం మరుగుదొడ్లు నీటి వసతి లేదు అని అన్నారు, బిఆర్ఎస్ ప్రభుత్వం బీసీ బందు పేరిట 136 బిసి కులాలు ఉంటే కేవలం 14 కులలనే చేర్చి మరియు 15 రోజుల్లోనే దరఖాస్తు చేసుకోవాలని అనేక కండిషన్లు పెట్టి లబ్ధి పొందకుండా బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తుందని శ్రావణి పలు ఆరోపణ చేశారు.
ఈ సమావేశంలో బీజేపీ బీర్పూర్ మండల్ ఇన్చార్జ్ పడాల తిరుపతి, సారంగాపూర్ మండల అధ్యక్షులు ఎండబెట్ల, వరుణ్ కుమార్, జగిత్యాల్ రూరల్ మండల అధ్యక్షులు నలువాల తిరుపతి, జగిత్యాల పట్టణ ఉపాధ్యక్షులు మడిశెట్టి మల్లేశం, బీజేవైఎం సారంగాపూర్ మండల అధ్యక్షులు దిటి వెంకటేష్ , ఎస్సీ మోర్చా అధ్యక్షులు నక్క జీవన్, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగరాజాం , మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.