జగిత్యాల రాజకీయ వాతావరణాన్ని పాడుచేయకు భోగ శ్రావణికి హితవు !

గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్

J.SURENDER KUMAR,

రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన బిజెపి నాయకురాలు శ్రావణి దశాబ్దాల జగిత్యాల రాజకీయ వాతావరణాన్ని వ్యక్తిగత దూషణలతో మార్చేందుకు ప్రయత్నిస్తోందని ఈ పద్ధతి మార్చుకోవాలని జిల్లా గ్రంధాలయాల సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ హితబోధ చేశారు.

శుక్రవారం నాడు జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇటివలె ఎమ్మెల్యే సంజయ్ పై బిజెపి నాయకురాలు బోగ శ్రావణి చేసిన ఆరోపణలపై బీఆర్ ఎస్ నాయకులు కౌంటర్ ఎటాక్ చేశారు.
ఈ సందర్భంగా చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ జగిత్యాల రాజకీయ పరిసరాలు గత ముప్పది ఏండ్లకు పైగా గౌరవప్రదముగా ఉన్నాయన్నారు. కానీ ఇటీవలి కాలంలో బిజెపి నాయకుల మూలంగా ప్రజలకు జరగాల్సిన మేలుకంటే వ్యక్తిగత ఆరోపణలతో రాజకీయ వాతావరణం కలుషితమవుతోందన్నారు. ఇందులోనూ బిజెపి నాయకురాలు బోగ శ్రావణి కేవలం డా. సంజయ్ కుమార్ నే టార్గెట్ చేస్తూ వ్యక్తిగత విమర్శలకు దిగుతోందన్నారు. ఇది సరియైన పద్ధతి కాదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, రాజేశం గౌడ్, రమణ వంటి సీనియర్ నాయకులు ఏనాడు వ్యక్తిగత దూషణలు దిగలేదని ఇప్పుడు ఇదో అలవాటుగా మారిందని చంద్రశేఖర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో అధికారపార్టీ తప్పిదాలను నిర్మాణాత్మక రీతిలో విమర్శలు చేయాలని అవికూడా సద్విమర్శలుగా ఉండాలన్నారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తెచ్చిన దరిద్రపు వ్యక్తిగత దూషణల అలవాటు ఇప్పుడు శ్రావణి అమలుచేస్తోందని ప్రతివిషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని చంద్రశేఖర్ గౌడ్ అన్నారు.
ఈ సమావేశంలో బీఆర్ ఎస్ నాయకులు బాల ముకుందం, బీఆర్ఎస్ పట్టణ మహిళ అధ్యక్ష, కార్యదర్శులు కచ్చు లత, శ్రీమంజరి, అర్బన్ మండల సర్పంచుల ఫోరమ్ అద్యక్షులు గంగాధర్, గుల్లపేట, జాభితాపూర్, వంజరిపల్లి, గొల్లపల్లి సర్పంచులు తిరుపతి, సతీష్, గంగారాం, ప్రకాష్ తోపాటు పోరుండ్ల ఎంపిటిసి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.