కెసిఆర్ ప్రభుత్వానికి కలిసికట్టుగా అండగా ఉండాలి ..

మంత్రి కొప్పుల ఈశ్వర్ !


J.SURENDER KUMAR

తెలంగాణ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి పధకాలు అమలు అవుతున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా గ్రామస్తులు అంతా కలిసి కట్టుగా ఉండి కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉండాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు నిచ్చారు.

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో ఆషాడ మాసం సందర్భంగా గ్రామస్తులు ఆదివారం నాడు నిర్వహించిన బోనాల ఉత్సవంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ముందుగా గ్రామస్తులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ₹ 15 లక్షల తో వెల్మ, గౌడ, మున్నూరు కాపు భనన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు


ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…..
బోనాల ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఏ రాష్ట్రంలోనూ బోనాల ఉత్సవాలు ఇంత ఘనంగా జరుపు కొరని చెప్పారు. పోచమ్మ తల్లి దీవెనలతో రాష్ట్రంలోని పల్లెలు అభివృద్ధి పదంలో నడుస్తున్నాయని అన్నారు.
ఈ వేడుకల్లో బిఆర్ఎస్ సీనియర్ నేత ఓరుగంటి రమణా రావు తో పాటు, జెడ్పీటీసీ రాజేందర్, యంపిపి గోళి శోభ సురేందర్ రెడ్డి, పలువురు మండల నాయకులు పాల్గొన్నారు.

జువ్వడి కుటుంబాన్ని పరామర్శించడం మంత్రి !

స్వర్గీయ మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు సతీమణి సుమతి దశ దిన కార్యక్రమం సందర్బంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి మండలం తిమ్మాపూర్ లోని వారి నివాసానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్వర్గీయ సుమతి చిత్ర పటం వద్ద పుష్ప గుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. జువ్వాడి కుటుంబం తో తనకు ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్నారు.