J.SURENDER KUMAR,
నిత్యం తన వార్డు ప్రజలు కోతుల వీరంగంతో ఇబ్బందులు పడుతున్న సమస్యను ఆ కౌన్సిలర్ గుర్తించారు. చట్టసభలలోను, జిల్లా, స్థానిక అధికార యంత్రాంగం సైతం కోతుల బెడద నివారణ చేయలేక, బాధితులకు న్యాయం చేయలేక, నివారణ కోసం ప్రయత్నాలు చేస్తున్నాము అంటూ నచ్చచెప్పుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి పట్టణంలో పలు సందర్భాలలో కోతుల వీరంగంతో అనేకమంది గాయపడగా ఒకరు గాయాలపాలై గతంలో మృతి చెందారు.

కోతుల బెడద నుండి తాత్కాలిక రక్షణ కోసం ధర్మపురి లోని 11వ వార్డు కౌన్సిలర్ జక్కుపద్మ రవీందర్, ఆధ్వర్యంలో సోమవారం ప్రతి ఇంటికి ఒక ‘ గులేరును’ ఉచితంగా పంపిణీ చేశారు.
కోతులు వీరంగం తో ఇళ్లలోని కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళన చెందుతున్నారని, ఇండ్లలోని చెట్ల పై, గోడల పై ఉంటూ అవి భయపెట్టడంతో పాటు ఇళ్లల్లోకి చొరబడి వస్తువులను చిందర వందరం చేస్తున్నాయని పంపిణీ సందర్భంగా కౌన్సిలర్ ఆవేదన వ్యక్తం చేశారు.

తన వంతు బాధ్యతగా తన వార్డు ప్రజలకు ‘ గులేరులు’ కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నానని. కోతుల కు దీనిని చూపిస్తే అవి భయంతో పరుగులు తీస్తాయని ఆమె వార్డు ప్రజలకు వివరించారు. వాటిని ” రాళ్లు పెట్టి కొట్టాల్సిన పని లేదు. కోతి పైకి ఎక్కుపెట్టి చూపిస్తే సరిపోతుంది అన్నారు.
చాలా రోజుల గా కాంగ్రెస్ కౌన్సిలర్ ల పక్షాన కోతులు, పందులు, కుక్కలు, ఆవులు, ఎడ్లు బర్రెలు రోడ్ల మీద వదిలిపెట్టకుండా చూడాలని కమిషనర్ దృష్టికి చాలాసార్లు ఫిర్యాదు చేశామన్నారు. పందుల సంచారం కొంతమేరకు నియంత్రించారని,మిగతా వాటి నీ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేవిధంగా కమిషనర్ మరియు చైర్మన్ చొరవ తీసుకోవాలని కౌన్సిలర్ జక్కు పద్మా రవీందర్ కోరుతున్నారు.
