మంచి మనసు, ఆలోచనలు ఉంటే భగవంతుడు మన వెంటే ఉంటాడు !

మంత్రి కొప్పుల ఈశ్వర్..


J.SURENDER KUMAR,

మంచి మనసుతో ఎప్పుడూ అందరికీ మేలు జరగాలని ఆలోచనలు ఉన్నట్టయితే భగవంతుడు ఎక్కడ ఉండడు మన వెంటనే ఉంటాడు, వారికి ఎప్పుడు విజయమే జరుగుతుంది. అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవం భాగంగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకొని, ఆలయ ఆవరణలో 150 జంటలతో సామూహిక రమా సత్యనారాయణస్వామి వ్రతంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..


తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో సందర్భంగా ప్రభుత్వం నిర్ణయించిన దానికి అనుగుణంగా ఈరోజు ఆధ్యాత్మిక దినోత్సవం, రేపు అమరవీరుల స్థూపంతో పాటు, అమరవీరులకు త్యాగాలను గుర్తు చేస్తూ రేపు మనము ఆ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం అని అన్నారు.
ఇతరుల పట్ల, సమస్యల పట్ల, ప్రాంతం పట్ల, మనుషుల పట్ల ప్రేమ అనురాగాల తో మన మెలగాల్సినటువంటి అవసరాన్ని భగవంతుడు అప్పుడప్పుడు గుర్తుచేస్తూనే ఉంటాడు అని మంత్రి ఈ సందర్భంగా వివరించారు.


నాగమయ్య దేవాలయ పునర్నిర్మాణానికి భూమి పూజ


ధర్మపురి పట్టణ కేంద్రంలో నంది చౌరస్తా సమీపంలో గల నాగమయ్య దేవాలయం పునర్నిర్మాణం కొరకు ₹12 లక్షల నిధులతో చేపట్టనున్న పనులకు మంత్రి భూమి పూజ చేశారు.


ధూప దీప నైవేద్య ఉత్తర్వులు అందజేత!


ధర్మపురి నియోజకవర్గం లోని గ్రామీణ ప్రాంతాల్లో 24 దేవాలయాలకు దూప దీపం నైవేద్యం పథకాన్ని వర్తింపజేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే,
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఎంపికైన ఆలయాల అర్చకులకు ఉత్తర్వులను మంత్రి కొప్పుల ఈశ్వర్ అందించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ సంగీ సత్యమ్మ, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత,
అడిషనల్ కలెక్టర్ మంద మకరంద్ , డిసిఎంఎస్ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి జెడ్పీటీసీలు, యంపిపిలు, సర్పంచ్ లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు, పిఎస్ఎస్ చైర్మన్ లు, తదితరులు పాల్గొన్నారు,