J.SURENDER KUMAR,
వేసవి కాలం మండు ఎండల్లో సైతం నీటి కుండల్ల చెరువులలో పుష్కల నీటి నిలువలు ఉంటున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అర్బన్ మండల మోతే గ్రామ చెరువుకు ₹14 లక్షలతో మత్తడి మరమ్మత్తు పనులకు ఎమ్మెల్సీ ఎల్ రమణ తో కలిసి భూమి పూజ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ ములసపు లక్ష్మి, జెడ్పీటీసీ మహేష్, సర్పంచ్ స్వప్న రాజేశ్వర్ రెడ్డి,
ఎంపీటీసీ రాజ శేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ వెంకటేష్, మండల పార్టీ అధ్యక్షులు సురేందర్ రావు, మండల రైతు బందు కన్వీనర్ జుంబర్తి శంకర్, SE శ్రీనివాస్, EE AH ఖాన్, మండల యూత్ అధ్యక్షులు శేకర్, మండల పార్టీ ఉప అధ్యక్షులు గంగాధర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షలు ముత్తన్న, ఎస్టీ సెల్ అధ్యక్షులు శ్రీరామ్ బిక్షపతి, గ్రామ శాక అధ్యక్షులు చంద్ర మౌళి, యంపివో సలీం, నాయకులు పోచయ్య,గంగ మల్లయ్య, నాయకులు, వార్డు సభ్యులు తదితరులు, పాల్గొన్నారు.
నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు

జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి, రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ గ్రామాల కు చెందిన 14 మంది నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేశారు.
ఈ కార్యక్రమంలో డా.విజయ్, కౌన్సిలర్ కుసరి అనిల్, సర్పంచ్ బుర్ర ప్రవీణ్ గౌడ్, పట్టణ, అర్బన్ మండల యూత్ అధ్యక్షులు కత్రోజ్ గిరి, మత్తలపురం శేకర్, పట్టణ యూత్ ఉప అధ్యక్షులు ఏనుగుల రాజు, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.