J.SURENDER KUMAR,
సీఎం కేసీఆర్ తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కరించండి అంటూ జగిత్యాల జిల్లా ధర్మపురి మండల పెన్షనర్ల సంఘం సోమవారం స్థానిక తాసిల్దార్ ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం పంపించారు.
వినతి పత్రంలో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి.!
👉 పెన్షనర్లు వివిధ అనారోగ్య కారణాలతో ఆసుపత్రులలో లక్షల రూపాయల బిల్లులు చెల్లించవలసి వస్తున్నందున 1వ పి.ఆర్.సి. సిఫారసులకు అనుగుణంగా పెన్షనర్ల మూల వేతనము నుండి 1% మినహాయించి పూర్తి స్థాయిలో E.H.S.అమలు పరచుటకు మనవి.
👉 పెన్షనర్ల నుండి కమ్యుటేషన్ ద్వారా పొందిన మొత్తమును 15 సం.ల (180 వాయిదాల లో) వరకు మినహాహించబడుచున్నది. ఇది చాలా కాలము క్రితమే చేయబడిన లెక్కల ప్రకారము మినహాయించబడుచున్నది. ప్రస్తుత వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణము, జీవనవ్యయము తదితర అంశాలను పరిగణలోనికి తీసుకొని అట్టి రికవరీ కాలాన్ని 12 సం.లకు తగ్గించుటకు విజ్ఞప్తి.
👉.2వ పి.ఆర్.సి.ని నియమించి 1-7-2023 నుండి అమలు పరచుట మరియు ఐ.ఆర్. చెల్లించుట.
👉 పెండింగ్ రెండు డి.ఆర్.లు చెల్లిచుట. (5) నెలల తరబడి ఇ. కుబేర్ లో పెండింగు లో వున్న బిల్లులను వెంట వెంటనే చెల్లించుట.(6) ప్రతి నెల మొదటి తేదిన పెన్షన్లు చెల్లించుట.
👉.398 రూపాయల క్రింద నియమకాలు జరిగిన స్పెషల్ ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంటు ఇచ్చుట.
👉 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం లో 85% పెన్షనర్లు సభ్యులుగా వున్నందు వలన TSGREA సంఘానికి ప్రభుత్వ గుర్తింపు ఇచ్చుట.
. 👉 జీవనవ్య యము విపరీతంగా పెరిగినందువలన రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల కనిష్ఠ పెన్షన్ ను ₹.30,000/- లుగా నిర్ణయించుట.
ఇతర సమస్యలపై పెన్షనర్ల సంఘంతో ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్చలు జరిపి మా సమస్యల పరిష్కరించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
పెన్షనర్ల సంఘం నాయకులు మ్యాన రాజయ్య, ఎండి వజీర్, అఫ్జల్, అలవాల దత్తాత్రి, ఐ. బండయ్య, కొరిడే శంకర్, అంబరీషా చారి, గొలిపెలి గుండయ్య, పెండ్యాల రవీందర్, కే. రాజేశ్వర్ మధ్వాచారి రామకృష్ణ, మహిళా నాయకులు. తదితరులు తాసిల్దార్ కార్యాలయంకు వెళ్లి వినతి పత్రం అందజేశారు.