మేనిఫెస్టో ను ఒక పవిత్ర గ్రంధం గా సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు!

ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్!


J.SURENDER KUMAR,

మేనిఫెస్టో ను ఒక పవిత్ర గ్రంధం గా భావించి, అందులో ఉన్నది ఉన్నట్టుగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ అన్నారు.
శుక్రవారం సాయంత్రం పల్నాడు జిల్లా సత్తెనపల్లి లో జలవనరుల శాఖ మంత్రి శ్రీ అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన “మేనిఫెస్టో అంటే జగన్” చర్చా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వాలంటీర్లు, ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి తరఫున గడప గడపకు తిరిగి నిరంతరం శ్రమించేలా ఒక వ్యవస్థ ను రూపొందించిన వ్యక్తి సీఎం జగన్ అని, దేశంలో ఎక్కడా ఇటువంటి వ్యవస్థ లేదని అమర్ అన్నారు. ఒకప్పుడు సమాజంలో పత్రికలు విశ్వసనీయత కలిగి ఉన్నాయి అని, నేడు సోషల్ మీడియా ద్వారా సత్యం కనుమరుగు అవుతున్నది, వాస్తవాలు ప్రజలకు చేరడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమ పార్టీ కాబట్టే మేనిఫెస్టో లో చెప్పిన విధంగా పథకాలు విజయవంతంగా అమలు జరుగుతున్నాయని, ప్రతి గడపకు లబ్దిచేకూరాలనే ధ్యేయంతో సిఎం పని వేస్తున్నారని అమర్ అన్నారు.


అభివృద్ది అంటే భవనాలు కట్టించడం మాత్రమే కాదు అని, పేదరిక నిర్మూలన, ప్రజల శ్రేయస్సు, సంక్షేమమే అభివృద్ది అవుతుంది అని, రాష్ట్రంలో అభివృద్ధి లేదు అనేది కేవలం అపోహ మాత్రమే అని అన్నారు.
ఎమ్మెల్సీలు మర్రి రాజ శేఖర్, డొక్కా మాణిక్య వరప్రసాద్, సీనియర్ పాత్రికేయులు వివిఆర్ కృష్ణంరాజు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.