₹ 399కే ₹10 లక్షల ప్రమాద బీమా ..
పోస్టల్ ఎస్పి శ్రీనివాసరావు !
J.SURENDER KUMAR,.
ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులకు కరీంనగర్ పోస్టల్ సూపరిండెంట్ శ్రీనివాసరావు మంగళవారం ₹ 10 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం, డబ్బు తిమ్మయ్యపల్లి గ్రామానికి చెందిన , లయి శెట్టి వెంకటేష్, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతను పోస్ట్ ఆఫీస్ లో ₹ 399కే ₹10 లక్షల ప్రమాద బీమా పథకాన్ని తీసుకోవడంతో అతడి కుటుంబానికి భీమా కింద ₹10 లక్షలు మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన చెక్కును మంగళవారం వెంకటేష్ కుటుంబ సభ్యులకు సూపరింటెండెంట్ అందించారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సంవత్సరానికి ₹.399 భీమా తీసుకుంటే ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి కుటుంబానికి ₹10 లక్షల రూపాయలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈనెల 30 వరకు ప్రత్యేక శిబిరాల ద్వారా ప్రతి పోస్ట్ ఆఫీస్ లో ఈ బీమా తీసుకోవచ్చునని తెలిపారు. పోస్టల్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ సూపరింటెండెంట్ శ్రీనివాస రావు అన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాధ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబంలోని అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ బీమా చేసుకోవాలని మరణించిన కుటుంబానికి ఆసరాగా ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసిస్టంట్ సూపరిండెంట్ కిరణ్ రెడ్డి , ఐ పి పి బి బ్రాంచ్ మేనేజర్ తొర్తి రాజేష్, రేవతి , మెయిల్ ఓవర్సీస్ శ్రీనివాస్, బీపీయం షబ్బీర్, పోస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.