ముదిరాజ్‌ సమాజానికి పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణ చేప్పాలి – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ !

J.SURENDER KUMAR,

ముదిరాజ్‌ సమాజానికి ఎమ్మెల్సీ పాడి కౌసిక్‌ రెడ్డి బె షరతుగా క్షమాపణ చేప్పాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్ లో సోమవారం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు
.

భారత రాష్ట్ర సమితిని ను గద్దె దించేందుకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ పార్టీ గనుక నే నమ్మకంతో కాంగ్రెస్‌ పార్టీలో వలసలు కొనసాగుతున్నాయన్నారు.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి లాంటి నాయకులు భాజపాలో చేరినా.వారు ప్రత్యామ్నయం ఆలోచిస్తున్నారన్నారు.. కానీ భారతీయ జనతా పార్టీ మునిగిపోయే నావ లాంటిదన్నారు.
ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏ.లక్ష్మణ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆది శ్రీనివాస్, నాయకులు బండ శంకర్, తదితరులు పాల్గొన్నారు.