దేశానికి మార్గదర్శకంగా తెలంగాణ రాష్ట్రం !
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్!
J.SURENDER KUMAR,
నేడు తెలంగాణ ఆచరిస్తున్న ప్రతి పథకాన్ని దేశం అనుసరిస్తుందని దేశానికి మార్గదర్శకంగా తెలంగాణ నిలిచిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పథకాలు దేశంలో అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ఢిల్లీ రాజకీయాలలో కేసీఆర్ అడుగుపెట్టారని అన్నారు.
రాయికల్ మండల భూపతిపూర్ గ్రామంలో తెలంగాణ దశాబ్ది వేడుకలు భాగంగా శనివారం రైతు దినోత్సవం కార్యక్రమంలో రైతు వేదికలో రైతులతో నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పై శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం నుండి ప్రారంభమై నేడు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని కార్యక్రమాలలో అగ్ర భావన ఉందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో రైతుల జీవన విధానంలో మార్పు వచ్చిందని అన్నారు.
9 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో రైతుల అభివృద్ధి సంక్షేమానికి చేసిన కృషిని వివరించే ఉద్దేశంతోనే రైతు దినోత్సవం ప్రతి రైతువేదికలలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

భూపతిపూర్ గ్రామానికి గడిచిన తొమ్మిది సంవత్సరాలలో ₹ 47 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు.
గతంలో ఇంత పెద్ద మొత్తం లో నిదులు వచ్చేవా అని ప్రశ్నించారు. చర్చకు సిద్దం అని సవాల్ చేశారు.
జగిత్యాల నియోజకవర్గంలో 2014 ముందు 23 వేల ఎకరాలలో పంట సాగు చేస్తే నేడు 59 వేల ఎకరాలలో పంట సాగు అవుతుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు.
ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సరిపోదని ప్రశ్నిస్తే పనులు కావని పని చేయాలని సంకల్పం నిబద్ధత ఉంటేనే పనులు జరుగుతాయని ముఖ్యమంత్రి సంకల్ప బలంతోనే నేడు తెలంగాణ రాష్ట్రం దేశంలో అన్ని రంగాల్లో అగ్ర బాగాన నిలిచిందని ఎమ్మెల్యే అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు పెరిగాయని రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు, కరెంటు, తదితర మౌలిక వసతులు కల్పన ద్వారానే భూముల ధరలు పెరిగాయని ముఖ్యమంత్రి కృషి వల్లనే అని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం రాకముందు వరి ధాన్యం సాగులో తెలంగాణ దేశంలో 13వ స్థానంలో ఉండేదని నేడు రెండవ స్థానంలో ఉందని అన్నారు. రైతు బాగుంటేనే కూలీలు వ్యాపారులు రాష్ట్రం దేశం బాగుంటుంది అని రైతు పక్షపాతి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు.
ధరణి, కొత్త పాస్ పుస్తకాల ఆవిష్కరణ ద్వారా రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికిందని, కొన్ని సమస్యలు ఉండడం సహజమని కానీ ఊహించనంత పనులు తెలంగాణ రాష్ట్రంలో జరిగాయని ఆలోచన చేయాలని అన్నారు.
రైతు వ్యతిరేక చట్టాలు ఏర్పాటు చేసి, రైతులకు క్షమాపణ చెప్పి, పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలు పెంచి రైతుల నడ్డి విరిచే ప్రయత్నం చేసే కేంద్ర బీజేపీ సర్కారు పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, రైతు నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ కి రైతుల మద్దతు ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంధ్యారాణి సురేందర్ నాయక్, జడ్పిటిసి అశ్విని జాదవ్, మండల పార్టీ అధ్యక్షులు కోల శ్రీనివాస్, సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ మహేశ్వర రావు, పిఎసిఎస్ చైర్మన్లు ఏనుగు మల్లారెడ్డి, ముత్యంరెడ్డి, రాజిరెడ్డి, రైతు బంధు సమితి మండల, జిల్లా సభ్యులు మోహన్ రావు, రాజన్న , పొలాస ఏడిఆర్ శ్రీనివాస్, సర్పంచుల ఫోరం శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు దేవేందర్, నాయకులు రంజిత్, హరీష్ ,గోపి, తిరుపతి, ఏవో ముక్తేశ్వర్, హార్టికల్చర్ అధికారిని స్పందన,రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.