ఒడిస్సా రైలు ప్రమాదంలో 50 మందికి పైగా మృతి – 179 మందికి పైగా తీవ్ర గాయాలు!


కొనసాగుతున్న రిస్కు ఆపరేషన్! క్షతగాత్రులను తరలించడానికి


60 అంబులెన్సులు, పదుల సంఖ్యలో బస్సులు!
మృతుల  క్షతగాత్రుల సంఖ్య పెరగవచ్చు!


మృతుల కుటుంబాలకు ₹10 లక్షలు.
తీవ్రంగా గాయపడిన వారికి ₹ 2 లక్షలు
గాయపడిన వారికి ₹50 వేలు
రైల్వే మంత్రి  ట్విట్టర్లో ప్రకటన!


ఒడిశా చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జెనా !


J.SURENDER KUMAR,

బాలాసోర్ జిల్లాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో దాదాపు 50 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు, ప్రాథమిక సమాచారం.  179, తీవ్రంగా గాయపడినట్టు ఒడిస్సా చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జైన్ PTI కీ తెలిపారు.  60 అంబులెన్స్‌ల తో సాయక చర్య చేపడుతున్నట్టు ఆయన తెలిపారు.  అయితే క్షతగాత్రులు సంఖ్య మృతుల సంఖ్య పెరగవచ్చు  అధికారులు అంచనా వేస్తున్నారు. 

రైల్వే మంత్రి ప్రకటించిన ఎస్గ్రేషియా సంతాపం

మృతులు కు ₹10 లక్షల రూపాయలు తీవ్రంగా గాయపడిన వారికి ₹.2 లక్షలు గాయాలపాలైన వారికి ₹ 50 వేలు ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు పదుల  సంఖ్యలో బస్సులను సమాయత్తం చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రపతి సంతాపం


ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ప్రభుత్వ,  ప్రైవేటు ఆసుపత్రులను, మెడికల్ షాపులను తెరిచి ఉంచారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఒరిస్సా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం


NDRF బృందం రెస్క్యూ
ఒడిశా ప్రభుత్వం కూడా ఆపరేషన్‌లో సహాయపడేందుకు ప్రమాద స్థలంలో లైట్ల కోసం జనరేటర్లు ఏర్పాట్లు చేసింది. 22 మంది సభ్యులతో కూడిన మొదటి NDRF బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. రెస్క్యూ ఆపరేషన్‌లో సహాయం చేయడానికి ఐదు అంబులెన్స్‌లను పంపినట్లు ఒడిశా స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తెలిపింది. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కూడా 15 అంబులెన్స్‌లను పంపినట్లు తెలిపింది.
హెల్ప్ లైన్!
హౌరా హెల్ప్‌లైన్ – 033 26382217, ఖరగ్‌పూర్ హెల్ప్‌లైన్ – 8972073925, 9332392339,
బాలాసోర్ హెల్ప్‌లైన్ – 8249591559, 7978418322,
షాలిమార్ హెల్ప్‌లైన్ – 9903370722 , 9903370746
 5330953 , 044 25354771