పట్టణ మహిళా సమాఖ్య భవనాన్ని మరో సంస్థ కు కేటాయించడం పై మహిళల ఆగ్రహం !

మహిళా సమాఖ్యల పై వివక్ష తగదు..


J.SURENDER KUMAR,

జగిత్యాల పట్టణ మహిళా సమాఖ్య సభ్యుల అభ్యున్నతి కోసం కేటాయించిన భవనాన్ని బాల రక్షక్ సదన్ కు కేటాయించడాన్ని నిరసిస్తూ, జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మీ దేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం ఇచ్చారు.


ఈ సందర్భంగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాట్లాడుతూ..
మహిళా సమాఖ్యల కోసం కేటాయించిన టౌన్ లేవల్ ఫెడరేషన్ భవనాన్ని బాల రక్షక్ సదన్ కు కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం….
టీఎల్ఎఫ్ ఏళ్ల తరబడి 60 సమాఖ్యలు, 60మంది అధ్యక్షురాళ్లు. 60 మంది రిసోర్స్ పర్సన్లు ప్రతినెలా 24న సమావేశం నిర్వహిస్తున్నారు.
మున్సిపల్ ఛైర్పర్సన్ పదవి బీసీ కేటాయించగా, ఓసీని చైర్మన్ గా చేయడంతో, మహిళల బాధలు అర్థం చేసుకోలేని పరిస్థితి నెలకొంది.


బాల రక్షక్ సదన్ కు తాము వ్యతిరేకం కాదని, మహిళా లకు కేటాయించిన భవనాన్ని మహిళా సమాఖ్య తిరిగి అప్పగించాలని, బాల్ రక్షక్ సదన్ కోసం నూతన కలెక్టరేట్ భవనంలో గదులు కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య. నక్క జీవన్, కౌన్సిలర్ ఆసియా సుల్తానా, సహారా అన్జుం, మాజీ కౌన్సిలర్ అల్లాల సరితరమేష్, బింగి సుమరవి, పులి సునీత రాము, గాజుల రాజేందర్, మన్సూర్, నేహల్, గుండా మధు, రాజేష్, చాంద్ పాషా, కచ్చు హరీష్, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.