J.SURENDER KUMAR.
పట్టణ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం పై ఉంటుందని, పట్టణ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరమని జగిత్యాల శాసన సభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం మునిసిపల్ టౌన్ హాల్ లో పట్టణ ప్రగతి దినోత్సవం ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ, పట్టణంలోని ప్రజలకు త్రాగునీరు, రోడ్లు, మురికి కాల్వలు, వంటి సౌకర్యాలతో పాటు ఇతర సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత మునిసిపల్ అధికారులు, పాలనా యంత్రాంగం పై ఉందని అన్నారు. పట్టణ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఉండాలని, ప్రణాళికలతో పట్టణ అభివృధి చేపట్టాలని అన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగ చేసుకోవాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ, సఫాయన్న నీకు సలాం…అని అన్నారు. పారిశుధ్య పనివారు నిరంతరం పనులు చేపట్టడం ద్వారానే పట్టణం సుందరంగా ఉంటుందని, పట్టణం సుందరీకరణ లో ప్రజల సహకారం అవసరమని అన్నారు. జగిత్యాల పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారానే జిల్లా అభివృద్ధి కనబడుతుందని, భావ తరాల వారికి మంచి వాతావరణం, శ్వచ్చ సర్వెక్షన్ క్రింద చేపట్టిన పనుల ప్రగతిని అందించాలని అన్నారు. పురపాలక సంఘం నిధులలో 10 శాతం నిధులు గ్రీనరీ క వినియోగించడం జరుగుతున్నదని తెలిపారు. పురపాలక సంఘాలు పురోగతి సాధించడానకి తెలంగాణ మునిసిపల్ చట్టం రూపొందించడం ముఖ్యమంత్రి, పురపాలక శాఖ మంత్రి దార్శనికత నిదర్శనమని తెలిపారు. పట్టణ ప్రజలకు కనీస అవసరాలు కల్పించవలసిన బాధ్యత పాలక మండలికి ఉంటుందని అన్నారు. పట్టణ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న పాలక మండలి సభ్యులు, అధికారులను అభినందించారు. TS బి – పాస్ ద్వారా భవన నిర్మాణాలకు అనుమతులు అందించడం చారిత్రాత్మకమని, 7 బస్తీ దవాఖానా లు ఏర్పట్చేస్తున్నామని తెలిపారు. ఓపెన్ జిమ్ లు, వైకుంఠ దామాలు, నర్సరీలు, ఇంటింటి చెత్త సేకరణ, పారిశుధ్యం, సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు వంటి పనులు చేపడుతున్నామని తెలిపారు. పారిశుధ్యం, హారితహారం కార్యక్రమాల నిర్వహణలో కోరుట్ల మున్సిపాలిటీకి అవార్డులు రావడం అభినందనీయమని అన్నారు. జగిత్యాల శాసన మండలి సభ్యులు ఎల్ రమణ మాట్లాడుతూ, అభివృధి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రికి రెండు కళ్ళు అని, జగిత్యాల పట్టణంలో ₹ 50 కోట్ల నిధులతో ప్రధాన రహదారులు, జంక్షన్లు, మురికి కాల్వల నిర్మాణాలు, ఆధునీకరణ వంటి పనులు చేపట్టడం జరిగాయని, మిషన్ భగీరథ ద్వారా పట్టణ ప్రజలకు మంచినీటి సౌకర్యం కోసం ₹ 36.42 కోట్లతో 110 కి.మీ.నూతన పైప్ లైన్, పంపింగ్ స్టేషన్, రెండు రిజర్వాయర్లు, 5426 నల్లా కనెక్షన్లు చేపట్టామని తెలిపారు. 250 కోట్లతో 4500 డబుల్ బెడ్ ఇళ్లను నిర్మించడం జరిగిందని, పంపిణీ కార్యక్రమం కోసం లబ్దిదారుల ఆన్లైన్ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. జిల్లాలో మెడికల్, అగ్రికల్చర్ కాలేజీ లను ఏర్పాటు చేయడం జరుగుతున్నదని తెలిపారు. రోడ్డు మరమ్మత్తులు, ఇతర పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ₹ 4.22 కోట్లతో 74 పారిశుధ్య వాహనాలు కొనుగోలు చేసి పట్టణ పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేసి నిరంతర విద్యుత్ సరఫరా ఇంటింటికి అందిస్తున్నామని తెలిపారు. బి పాస్ చట్టం క్రింద 21 రోజులలో 1627 దరఖాస్తు దారులకు అనుమతులు ఇవ్వడం జరిగిందని వివరించారు. అంతకు ముందు బతుకమ్మలు, బోనాలతో స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పారిశుధ్య కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఉద్యోగులను సన్మానించి, కిట్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఉత్తేజిత, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు పాటల రూపంలో ప్రదర్శనలు ఇచ్చారు. అంతకు ముందు మునిసిపల్ అభివృద్ధికి సంబంధిన పనులపై రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి మునిసిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, ఇంచార్జి మునిసిపల్ కమిషనర్ నరేష్, కౌన్సిలర్ల, మునిసిపల్ అధికారులు, సిబ్బంది, మెప్మా సిబ్బంది, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
రాయికల్ పట్టణంలో..

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాయికల్ పట్టణంలో గుడికోట ఆలయం లో ప్రత్యేక పూజలు చేసి. ₹ 1కోటి రూపాయలతో నిర్మించనున్న హిందూ కమ్యూనిటీ, ఓపెన్ షెడ్డు నిర్మాణానికి జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ,ఎమ్మెల్సీ ఎల్ రమణ శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని ఉత్తమ కౌన్సిలర్ లు, సపాయి కార్మికులను సన్మానించారు.19 మెప్మ స్వయం సహాయక సంఘాలకు 1 కోటి 70 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ మోర హనుమండ్లు, వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, కమిషనర్ సంతోష్, కౌన్సిలర్లు కన్నాక మహేందర్, మారంపెళ్లి సాయికుమార్, తురగ శ్రీధర్ రెడ్డి,వల్లకొండ మహేష్, అణ్వారి బేగం, శ్రీరాముల సువర్ణ,మ్యాకాల కాంతారావు, కోఆప్షన్ లు మహేందర్ బాబు, సోహైల్, వనిత. సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, నాయకులు ఎలిగేటి అనిల్ కుమార్, హుస్సేన్, మోర రామ్మోర్తి, అనుమల్ల చంద్ర తేజ, ప్రసాద్, దశరథం, విక్రమ్, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.