👉 కేంద్రం ₹ 12,911.15 కోట్ల నిధులు మంజూరుకు ఆమోదం !
👉 అధికారులతో సమీక్షా సమావేశం
👉 కీలక పనుల్లో గణనీయ ప్రగతి సీఎంకు వివరించిన అధికారులు !
J..SURENDER KUMAR,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం పోలవరం ప్రాజెక్టు సందర్శించి పనుల పురోగతితో పాటు పునరావాస కల్పనా వసతుల ఏర్పాట్ల గురించి ఆయన పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, పనులు జరుగుతున్న తీరుతెనులను పురోగతిని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గణాంకాలతో వివరించారు.
👉 స్పిల్‌వే కాంక్రీట్ పూర్తయ్యింది.
👉 48 రేడియల్ గేట్లు పూర్తిస్థాయిలో పెట్టారు.
👉 రివర్ స్లూయిస్ గేట్లు పూర్తయ్యాయి.
👉 ఎగువ కాఫర్ డ్యాంకూడా పూర్తయ్యింది.
👉 దిగువ కాఫర్ డ్యాం పూర్తయ్యింది.
👉 గ్యాప్ -3 వద్ కాంక్రీట్ డ్యాం పూర్తయ్యింది.
👉 పవర్‌హౌస్‌లో సొరంగాల తవ్వకం పూర్తయ్యింది.
👉 అప్రోచ్ ఛానల్ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయి.
👉 ఈసీఆర్‌ఎఫ్ డ్యాంలో దెబ్బతిన్న గ్యాప్-1 ప్రాంతంలో ఇసుక నింపే కార్యక్రమం పూర్తయ్యింది.
👉 ఆప్రాంతంలో వైబ్రో కాంపాక్షన్‌కూడా పూర్తయ్యింది.
👉 ఈసీఆర్‌ఫ్ గ్యాప్-2 ప్రాంతంలో నింపడానికి అవసరమైన 100శాతం ఇసుక రవాణా పూర్తయ్యింది.
👉 వాటిని నింపే పనులు చురుగ్గా ముందుకు సాగుతున్నాయి.
👉 నిర్వాసిత కుటుంబాల్లో 12658 కుటుంబాలను ఇప్పటికే తరలించామని తెలిపిన అధికారులు.

👉 దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.
👉 ఇది పూర్తైతే మెయిన్ డ్యాం పనులు చురుగ్గా కొనసాగడానికి అవకాశం ఉంటుందన్న సీఎం.
👉 డిసెంబర్ కల్లా పనులు పూర్తిచేయడానికి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామన్న అధికారులు.
👉 నిర్వాసిత కుటుంబాలకు పునరాసంపైనా సీఎం సమీక్ష.
👉 పునరావాసం కాలనీల్లో అన్ని సామాజిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్న సీఎం.
👉 కాలనీలు ఓవైపు పూర్తవుతున్న కొద్దీ, సమాంతరంగా వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం.
👉 షెడ్యూలు ప్రకారం…, నిర్వాసిత కుటుంబాలను తరలించేలా చూడాలన్న సీఎం.
👉 పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని అద్భుతమైన టూరిజ్టు ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న సీఎం.
👉 పోలవరం వద్ద మంచి బ్రిడ్జిని నిర్మించాలన్న సీఎం.
👉 పర్యాటకులు ఉండేందుకు మంచి సదుపాయాలతో ఇక్కడ హోటల్ ఏర్పాటు చర్యలు తీసుకోవాలన్న సీఎం.
👉 మరిన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటుతో మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సీఎం.