J.SURENDER KUMAR.
నియోజక వర్గంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే మంత్రి ఈశ్వర్ రైతు వేదికల వద్ద ఉత్సవాల నిర్వహిస్తున్నారని, రైతులకు ఎం చేశారని ఉత్సవాలు నిర్వహిస్తున్నారని, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు.
ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని శనివారం జిల్లా డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించి నల్ల కండువాలతో నిరసన తెలుపుతూ వడ్ల బస్తాలను మోసి హమాలీ పని చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న ఇబ్బందుల గూర్చి స్థానిక అధికారులకు ,జిల్లా కలెక్టర్ కు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చి, నిరసన తెలియజేసినప్పటికీ వారిలో ఎటువంటి మార్పు రాలేదన్నారు.
గత నెల రోజులుగా రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, ఈ రోజున స్వయాన మంత్రి కొప్పుల ఈశ్వర్ క్యాంపు కార్యాలయం ఎదుటనే రైతు వడ్లను పోసి నిరసన వ్యక్తం చేయడం రైతుల ఇబ్బందులకు నిదర్శనం అన్నారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ కళ్ళు తెరిచి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న ఇబ్బందులు తొలగించి త్వరితగతిన ధాన్యాన్ని కొనుగోలు చెయ్యాలని, మిల్లర్లను సైతం కట్టడి చేసి అధిక శాతం కటింగ్ పేరిట రైతులను దోచుకుంటున్న మిల్లర్ల పైన చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ధర్మపురి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగనభట్ల దినేష్ , బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు, ఎంపిటిసి సభ్యుడు కుంట సుధాకర్, ధర్మపురి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింహరాజు ప్రసాద్, మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందెని మొగిలి, మండలం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల రాజేష్, చిలుముల లక్ష్మణ్, పోచయ్య , ప్రశాంత్ , దూడ లక్ష్మణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు