J.SURENDER KUMAR,
తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు యువత ప్రధాన కార్యదర్శి గా నియామకం చేయబడ్డ బొంగురాల రాజేష్ ను ధర్మపురి పట్టణ మున్నూరు కాపు సంఘ నాయకులు శనివారం అభినందించారు. చలో హైదరాబాద్ పేరు తో ఆగస్టు 27న తలపెట్టిన ‘మున్నూరుకాపు యువత గర్జన’ విజయవంతం కోసం రాష్ట్ర కమిటీ బొంగరాల రాజేశ్ ను నియమించింది. ఈ నేపథ్యంలో రాజేష్ ఘనంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్నూరు కాపు సంఘం పట్టణ అధ్యక్షుడు సంగి రాజశేఖర్ , వ్యవస్థాపక అధ్యక్షులు బండి మురళి , గౌరవ అధ్యక్షులు సంగి నర్సయ్య, నాయకులు చల్ల గంగన్న, కాశెట్టి రాంబాబు, ఆకుల శ్రీనివాస్, బండారి లక్ష్మణ్, బండారి సత్యనారాయణ, సోమిశెట్టి శేఖర్, బొంగురాల సత్తన్న కౌన్సిలర్ల లు బండారి అశోక్, అయ్యోరి వేణు, కో ఆప్షన్ సభ్యులు అప్పాల వసంత్ తదితరులు పాల్గొన్నారు.