ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో ఉగ్రవాద లింకుల?
పట్టణాలలో విధ్వంసలు. పారిశ్రామిక ప్రాంతాలో స్థావరాలు ? ఉగ్రవాదులు అనుసరిస్తున్న వ్యూహంమా ?
J.SURENDER KUMAR,
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉగ్ర కదలికల అనుమానంతో గుజరాత్ ఏటీస్ బృందాలు గాలింపు కలకలం సృష్టించింది.
మంగళవారం సాయంత్రం పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ఇద్దరు నాలుగు రోజులుగా షెల్టర్ తీసుకుని ఉంటున్నారన్న సమాచారం అందుకున్న గుజరాత్ ఏటీఎస్( యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ ) బలగాలు వారిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
గత నాలుగేళ్లుగా వీరిద్దరూ కూడా హైదరాబాద్ లోని గోల్కొండ ఏరియాలోని ఓ కాలనీలో నివాసం ఉంటున్నారని, వీరికి టెర్రరిస్ట్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న పక్క సమాచారం తో ఏటీఎస్ బృందాలు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. కొద్ది సేపటి క్రితం వీరిని అదుపులోకి తీసుకున్న ఏటీఎస్ బృందం స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీరిద్దరిని కూడా హైదరాబాద్ లోని ఏటీఎస్ ప్రధాన కార్యాలయానికి తరలిస్తున్నామని సమాచారం ఇవ్వగా వారి వెంట సీఐ స్థాయి అధికారిని పంపినట్టు సమాచారం . 46 సంవత్సరాల వయసు గల సాఫ్ట్ వేర్ ట్రైనర్ ను 20 సంవత్సరాల వయసు గల యువతి ని కూడా ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. .అయితే వీరికి ఏ టెర్రర్ సంస్థతో సంబంధాలు ఏర్పర్చుకున్నారు,? వీరి ప్రమేయం ఎంత మేర ఉంది? అన్న విషయాలపై సమాచారం తెలియాల్సి ఉంది. సాంకేతికంగా టెర్రర్ సంస్థలకు సహకరిస్తున్నారా? లేక ఇతరాత్ర సహాకారం అందిస్తున్నారా? అన్న విషయం తేలాల్సి ఉంది. అనుమానితులగా మాత్రమే తాము తీసుకెల్తున్నామని ఏటీఎస్ బృందాలు స్థానిక పోలీసు అధికారులకు వివరించినప్పటికీ వీరి ఆచూకి దొరకబట్టుకుని మరీ రామగుండం పారిశ్రామిక ప్రాంతం వరకు రావడం సంచలనంగా మారింది. ఏది ఏమైనా మరో సారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించిన వారి గురించి గుజరాత్ ఏటీఎస్ టీమ్స్ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది.
కరీంనగర్ జిల్లాలో తొలి బాంబు
లష్కరే తోయిబా కోసం మిలిటెంట్లను రిక్రూట్ చేసే యత్నములో ఐ.ఎస్.ఐ సంస్థ దక్షిణ భారత కమాండర్ అజాఘోరి నాయకత్వములో జగిత్యాల డివిజన్ మెట్పల్లిలోని శ్రీ వేంకటేశ్వర సినిమా టాకీస్ లో 2000 ఫిబ్రవరి మాసంలో టిఫిన్ బాంబు పేల్చారు. అయితే ప్రాణ నష్టం జరగకపోవడంతో పోలీసులు దీపావళి టపాకాయగా ప్రచారం చేసి, బాంబు శకలా (రసాయణ పరీక్షలకు) ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. నివేదికలో అమ్మోనియం నైట్రేట్ రసాయనం ఉపయోగించినట్టు తేలడంతో పోలీసు యంత్రాంగం ఉలిక్కిపడింది.
జగిత్యాల లో అజాంఘోరి స్థావరం !
నిజామాబాద్ కేంద్రముగా చేసుకొని ఐ ఎస్ ఐ కార్యకలాపాలను విస్తరింప చేసిన “లష్కరే తోయిబా” దక్షిణ భారత కమాండర్ అజాంఘోరి కరీంనగర్ జిల్లాలో విస్తరణ కోసం జగిత్యాలలో మకాం ఏర్పాటు చేసుకొని సైకిల్ పై తిరుగుతూ వెదురు బుట్టలో పిన్నిసులు, కాటిక డబ్బీలు, దువ్వెనలు విక్రయిస్తు ఎవరికి అనుమానం రాకుండా సంచారిస్తు ఐ.ఎస్.ఐ కార్యకలాపాలను నిర్వహించేవాడు. 2000 సంవత్సరములో అప్పటి నిజామాబాద్ ఎస్.పి.రవిశంకర్ అయ్యంగార్ ఓ కేసు పరిశోధనలో (నకిలీ నోట్ల చలమణి, గల్ఫ్ ఏజెంట్ల మోసలు) నేపధ్యంలో ఓ యువకుడిని ఆదుపులో తీసుకొని విచారిస్తున్న క్రమంలో ఆ యువకుడికి ఐ.ఎస్.ఐ కార్యకలాపాలతో సంబందం ఉన్నట్టు తేలింది. దీంతో దక్షిణ భారత కమాండర్ అజాంఘోరి జగిత్యాలలో ఉన్నట్లు నిర్ధారించుకున్న ఎస్.సి. ఘోరీ కదలికపై నిఘా ఉంచారు. కొద్ది మంది పొలీసు సిబ్బందితో ఘోరిని పట్టుకోవడం కోసం జగిత్యాలలో ఎస్.పి రవిశంకర్ అయ్యంగార్ మాటు వేసారు. ఏప్రిల్ 6, 2000 సంవత్సరములో ఆర్.టి.సి డిపో వైపు సైకిల్ పై వెళ్తున్న అజాంఘోరిని వారు చుట్టు ముట్టడంతో ఘోరికి పాలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో ఘోరి హతమయ్యాడు. అతడి వద్ద లభించిన ఓ తాళం చెవి. ఆధారంగా పట్టణంలో తాళం ఉన్నఇళ్ళను వెతకగా నాలుగు (4) రోజులకు పోలీసులకు ఘోరి నివాస స్థావరం చిక్కింది. బాంబులు, పేలుడు పదార్ధాలు, బాంబులు తయారికి ఉపయోగించే పరికరాలు, వాటి సాహిత్యాన్ని స్వాధీన పర్చుకున్నారు. ఆ స్థావరంలో పాకిస్థాన్, గల్ఫ్ దేశాలకు ఘోరి చేసిన ఫోన్ కాల్స్ తో పాటు కీలక సమాచారం పోలీసులకు చిక్కింది. ఘోరి సైతం అమ్మోనియం నైట్రోజన్ బాంబులు తయారు చేసినట్టు పోలీసులు గుర్తించారు.
కరీంనగర్ బస్టాండ్ లో..
నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే కరీంనగర్ బస్ స్టాండ్ లో ఆగస్ట్ 2005న టిఫిన్ బాంబు పేలింది. ఈ సంఘటనలు ప్రాణ నష్టం జరుగనున్న 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుళ్లకు బాధ్యులు ఎవరు ? అనేది నేటికి నిఘ వ్యవస్థ చేదించలేదు. అయితే 2006 సెప్టెంబర్ 11న తిరిగి ఇదే బస్ స్టాండ్ లో టిఫిన్ బాంబులు పేలాయి. పలువురు స్వల్పముగా గాయపడ్డారు. అయిన పాలీనులు పట్టి పట్టనట్టు వ్యవహరించారనే ఆరోపణలు నేటికి ఉన్నాయి. ఇదే నెల చివరి వారంలో బస్టాండ్ ప్రాంతంలో తుపాకి తూటాలు దొరకపోవడంతో జిల్లా వాసులు ఉలిక్కిపడ్డారు. గుజరాత్ రాష్ట్ర మంత్రి హరెన్ పాండ్య హత్యకేసులో నిందితులైన వ్యక్తిని గుజరాత్ పోలీసులు10 సం క్రితం జగిత్యాల పరిసరాల ప్రాంతములో అదుపులోనికి తీసుకొని వెళ్ళారు. కొరుట్ల పట్టణంలో విద్యాభ్యాసం చేసిన అల్తాఫ్, హుసేన్ అనే యువకుడు, దేశ సరిహద్దుల వద్ద పోలీసులు అరెస్ట్ చేసారు. పట్టుబడిన యువకుడి వివరాలు కోసం భద్రత బలగాలు కొరుట్ల పోలీసులకు అక్కడి పోలీస్ అధికారి హిందీలో లేఖ వ్రాసారు. పోలీసులకు హింది రాకపోవడంతో “స్వతంత్ర వార్త” హిందీ దిన పత్రికలో విలేకరితో పోలీసులు ఉత్తరం చదివించుకోవడంతో వీరి ఉదంతం మీడియాకు తెలిసింది. దిల్సుఖ్నగర్ సాయిబాబా ఆలయములో సమీపంలో బాంబు పేలుడుకు కారకుడైన అబ్దుల్ రజాక్, 2007 సంవత్సరములో నిజమాబాద్ పట్టణ పరిసరాలలోని ఎస్.టి.డి బూత్ నుండి పాకిస్తాన్ కు ఫోన్ చేస్తు పట్టుబడిన ఆశిక్ ఆలీ, కరీంనగర్, నిజమాబాద్ జిల్లాలలో కార్యకలాపాలను కొనసాగించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్ మలక్ పేటకు
చెందిన మొహ్మద్ ఇమ్రాన్ గల్ఫ్ లో పని చేస్తు లష్కర్ తోయిబా సానుభూతిపరుడిగా కార్యకలాపాలను నడుపుతున్నట్టు నిర్ధారించుకున్న పాలీములు దిల్షుక్ నగర్ సాయిబాబా మందిరముపై దాడి కేసు తర్వాత ఇమ్రాన్ కదలికలపై నిఘా పెట్టారు. 2002 నవంబర్ 24న కరీంనగర్ శివారు ప్రాంతములో జరిగిన ఎన్ కౌంటర్ పాలీసులు ఇమ్రాన్ ను హతమార్చారు..
పల్లె ప్రాంతములో స్థావరాలు !
జగిత్యాల డివిజన్లోని ఓ పల్లె ప్రాంతములో ప్రభుత్వ పాఠశాల సమీపములో ఓ కట్టడంలో ఇతర రాష్ట్రానికి చెందిన 15 మందికి పైగా యువకులు కొంత కాలం నివాసం ఉంటు ఓ రకమైన శిక్షణ పొందేవారు. (2008 సంవత్సరములో) ప్రాథమిక పాఠశాలలో సింగిల్ టీచర్ (మహిళ ఉపాధ్యాయురాలు)విద్యాబోధన
చేసెది. ఆ యువకులు పాఠశాల విద్యార్థులను జాతీయ గీతం ఆలపించవద్దు అంటు బెదిరించడం, విద్యార్థులలో ప్రార్ధనలు చేయించవద్దు అని ఉపాధ్యాయురాలుని బెదిరించేవారు. భయాందోళన చెందిన ఉపాధ్యాయురాలు నెలల తరబడి పాఠశాలకు సెలవు పెట్టడంతో పాఠశాల మూతబడింది. విషయము తెలిసిన గ్రామస్ధులు యువకులకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిని నిలదీయడంతో గందరగోళం నెలకొంది. ఈ నేపధ్యంలో యువకులు అదృశ్యం అయ్యారు. ఈ సంఘటన వెలుగు చూడకుండా,విచారణ చేపట్టకుండా పొలీసు వర్గాలు మౌనం వహించాయి.
జిల్లా పోలీసు రికార్డులలో ఐ.ఎస్.ఐ ఉగ్రవాదుల లో ఇక్కడి వారి పేర్లు, వివరాలు లేకున్న ఏదో విధ్వంస సందర్భములో ఉగ్రవాదులతో లింకులు ఉన్న వాళ్ళు పాలీసులు ఈ జిల్లాలలోని ప్రాంతాల నుండి అదుపులోకి తీసుకొని విచారించడం, వారు గతంలో గల్స్, ముంబాయి, ఢిల్లీ, హైదరాబాద్ తదితర పట్టణాలలో జీవనోపాధి కోసం వెళ్ళి వచ్చినారు కావడం ప్రస్తానావర్తం.
వివిధ సంఘటనల నేపథ్యంలో జిల్లాలలో వారి సానుభూతి పరులు ఉన్నరా? లేక స్థావరాలు ఉన్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ దిశగా నిఘ వ్యవస్థ విచారణ జరిపితే కొంత మేరకు సమాచారం చిక్కే అవకాశం ఉందని మేధావి వర్గాలు భావిస్తున్నాయి..