J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం 9 ఏళ్ల జిల్లా ప్రగతిపై ప్రజలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు.
జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష తో మంత్రి కలిసి అమరుల వీరుల స్థూపం ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం తెలంగాణ యుద్ధం లో వీరమరణం పొందిన వారికి శ్రద్ధాంజలి ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన ప్రజలను ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. తెలంగాణ , జగిత్యాల లో అమలవుతున్న అభివృధి, సంక్షేమ కార్యక్రమా ల ప్రగతిని వివరించారు.
ఈ కార్యక్రమంలో .. జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత ,ఎమ్మెల్యేలు డా సంజయ్ కుమార్ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, జిల్లా ఎస్పీ భాస్కర్, అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత ,మంద మకరంద్ , గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.చంద్రశేఖర్ గౌడ్, DCMS చైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి జిల్లా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తదితరల పాల్గొన్నారు.
ధర్మపురి నియోజకవర్గానికి ₹ 10 కోట్ల నిధులు విడుదల!

ధర్మపురి నియోజకవర్గం లో స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్-2022-23 కింద ₹10 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ పథకం కింద ఏనుగులను నియోజకవర్గం వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం కేటాయిస్తూ కలెక్టర్ పరిపాలన అనుమతులను మంజూరు చేశారు.