పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !
J. SURENDER KUMAR,
కొద్ది నెలలలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలతో ఘన విజయం సాధించి 2024 జనవరి నూతన సంవత్సరములో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని పట్టపద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జోష్యం చెప్పారు.
మంగళవారం జగిత్యాల రూరల్ మండలం లింగంపేట్ గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కాంగ్రెస్ కార్యకర్తలు
కార్యకర్తల సమావేశంలో జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కామెంట్స్ …
మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యలను
ఖండించారు, కాంగ్రెస్ పార్టీకీ అభ్యర్థులే లేరని మంత్రి పేర్కొనటం విడ్డూరంగా ఉందని, పార్టీలో టిక్కెట్లు కావాలనే వారితో పోటీ అధికంగా ఉందన్నారు. బీఆర్ఎస్ నియంత్రుత్వ దోరణితో వ్యవహిరస్తుందని మండిపడ్డారు. వచ్చే ఎన్నిక్లలో కాంగ్రెస్ 80 స్థానాల్లో విజయం సాధిస్తుందని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ధర్మపురి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధుల నియామకం!

జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం ధర్మపురి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రతినిధులను నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు.
దొనుర్ గ్రామానికి చెందిన దాసరి పురుషోత్తం.
ఎండపెళ్లి మండలం రాజారాం పెల్లి కి చెందిన గాజుల విజయ్ గౌడ్.
ధర్మారం మండలం చింతల పెల్లి కి చెందిన నారా మహేందర్ లను
అధికార ప్రతినిధులుగా నియమించారు

ఈ కార్యక్రమంలో ధర్మపురి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింహరాజు ప్రసాద్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాందెని మొగిలి, వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూదరి రమేష్, గెల్లు శ్రీనివాస్, టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పోచయ్య, ప్రశాంత్, భరత్ యూత్ కాంగ్రెస్ నాయకులు ,పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు..
9 సంవత్సరాలకే దశాబ్ది ఉత్సవాలా ?
కాంగ్రెస్ కౌన్సిలర్ లు..

త్వరలో ఎన్నికలు జరగనున్నాయని 9 సంవత్సరాలకే రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవం అని ఉత్సవాలు నిరహిస్తున్న సందర్భం లో ధర్మపురి మున్సిపల్ పరిధి లో పిల్లలకుని ఉన్న పలు సమస్యలు చైర్ పర్సన్ శ్రీమతి సంగి సత్తెమ్మ కు మున్సిపల్ కమిషనర్ రమేష్ కు మంగళవారం కాంగ్రెస్ కౌన్సిలర్ లు వినతి పత్రం ఇచ్చారు. ఉత్సవాలు ముగిసే లోపు ఇట్టి సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ వేముల నాగలక్ష్మి, జక్కు పద్మ, గరిగే అరుణలు వారిని కోరారు.