👉 జగిత్యాల జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు !
👉 60 వేల మంది రైతుల నుంచి తరుగు పేరిట 2 లక్షల క్వింటాలకు పైగా తూకం!
👉 రైతుల రోదనలు, వేదనలు, అర్ధనాదాలు ఆలకించేది ఎవరు ?
J. SURENDER KUMAR,
జగిత్యాల జిల్లాలో 60393 మంది రైతుల కష్టార్జితమైన సొమ్ము దాదాపు ₹ 43 కోట్ల 9 లక్షలు 43 వేల, 760/- ( నలభై మూడు కోట్ల తొమ్మిది లక్షలు, 43 వేల 760/- రూపాయలు) ఎవరి ఖాతాలో జమ అయ్యాయో.? ఎవరు స్వాహా చేశారో ? అంతు పట్టని మిస్టరీగా మారింది. ఈ మొత్తం సొమ్ము రైతులు IKP, PACC, MEPMA కొనుగోలు కేంద్రాలకు వడ్లు అమ్మడానికి తెచ్చిన సందర్భంగా, తాలు, తప్ప, నాణ్యత ప్రమాణాలు లేవంటూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, . క్వింటాల్ వడ్ల కొనుగోలుకు అదనంగా 5 కిలోల నుంచి 8 కిలోల వరకు రైతుల నుంచి నిర్బంధంగా తూకం వేయించుకున్న విషయం తెలిసిందే. క్వింటాలు ఒక్కంటికి ఐదు కిలోల వడ్లు అదనంగా తూకంగా లెక్కించిన మొత్తం,₹ 2 లక్షల, 9 వేల 196 క్వింటాల్ ( 2,9,196) . క్వింటాల్ వడ్లకు ప్రభుత్వ నిర్దేశించిన ధర.₹, 2060/- ( రెండు వేల అరువది రూపాయలు). లెక్కించినా అట్టి వడ్ల విలువ ₹ 43 కోట్ల 9 లక్షల, 43 వేల 760/- ( ₹ 43,9,43,760).గా ఉంది.

👉 418392, మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలువివరాలు ఇలా!
2022 – 23 , యాసంగి వడ్లు కొనుగోలు కోసం ప్రభుత్వం జిల్లాలో 418 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో IKP ద్వారా 144 కేంద్రాలను, PAC ద్వారా 270 కేంద్రాలను .MEPMA ద్వారా ఒక్కటి, మొత్తం 415 కేంద్రాలలో 60393 మంది రైతుల ద్వారా 4,18,392 మెట్రిక్ టన్నులు ( నాలుగు లక్షల, పది యెనిమిది వేల మూడువందల తొంబై రెండు మెట్రిక్ టన్నులు) ప్రభుత్వం కొనుగోలు చేసినట్టు రికార్డులలో నమోదు అయింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర @క్వింటాల్ కు. ₹ 2060/- కాగా. 4,18,392 మెట్రిక్ టన్నుల వడ్లకు ప్రభుత్వం ₹ 861, కోట్ల, 88, లక్షల, 75 వేల 200/- ( ఎనిమిది వందల అరువది ఒక్క కోట్ల ఏనుభది యెనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందలు) రైతులకు చెల్లించాల్సి ఉండగా దాదాపు ₹6 కోట్లు కు పైగా 14 నాటి వరకు ప్రభుత్వం రైతులకు చెల్లించినట్టు రికార్డుల్లో నమోదయింది. ఈ సంవత్సరం ఏప్రిల్ చివరి మాసం నుండి జూన్ 14 వరకు కొనుగోలు చేసినట్టు ప్రభుత్వ రికార్డులలో నమోదైన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
👉 2 లక్షల క్వింటాళ్ల వడ్లు అదనపు తూకం వేసినవి..

తరుగు పేరిట క్వింటాలుకు 5 కిలోల నుంచి 8 కిలోల వరకు కొనుగోలు కేంద్రాల్లో అదనపు తూకం లో యావరేజ్ గా క్వింటాలు ఒక్కంటికి 5 ఐదు కిలోల చొప్పున లెక్కించిన. ప్రభుత్వం కొనుగోలు చేసిన 418392 మెట్రిక్ టన్నుల వడ్ల వివరాలు రికార్డులలో ఉంది, ఈ మొత్తం 41 లక్షల 83 వేల 920 క్వింటాల్ కాగా. క్వింటాల్ కు 5 కిలోల చొప్పున అదనపు తూకం ద్వారా 60393 మంది రైతుల నుంచి 2 లక్షల 9 వేల 196 క్వింటాళ్ల వడ్ల ను నిర్బంధంగా సేకరించిన కొనుగోలుదారులు వీటి వివరాలను రికార్డులలో నమోదు చేయలేదు. ట్రక్ షీట్లలో నమోదైన తూకం వివరాల మేరకు ప్రభుత్వం రైతుల ఖాతాలోకి డబ్బులు వేస్తారు. (ఐకెపి కేంద్రాలలో క్వింటాల్ 10 కిలోలు తూకం వేసిన ట్రక్ షీట్ లో మాత్రం క్వింటాల్ గానే నమోదు చేస్తారు, తరుగు పేరిట అదనంగా తూకం వేస్తున్న దాదాపు పది కిలోల వడ్లు విషయంలో రైతులు రాస్తారోకోలు, అధికార పార్టీ, రైస్ మిల్లర్ల పై రైతుల నిరసన వ్యక్తం చేస్తూ, ఆందోళనలు ఆరోపణలు, చేసిన విషయం విధితమే ) ఇట్టి వడ్ల విలువ ₹ 43 కోట్ల 9 లక్షలు 43 వేల 760/- మొత్తం ఎవరి ఖాతాలో జమ చేశారో ? ఎవరు స్వాహా చేశారో ? అంతుచిక్కని చిదంబర రహస్యం.
👉 2021-22 లో ₹ 30 కోట్లు ఎవరి ఖాతాలోకి ?

జగిత్యాల జిల్లా 2021-22 లో ప్రభుత్వం యాసంగిలో 292167 ( 2 లక్షల 92 వేల 167) మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేసింది. క్వింటాలు ఒక్కంటికి రైతుల నుంచి. అదనంగా 5 కిలోలు చొప్పున తూకం వేసి కొనుగోలుదారులు రైతుల నుంచి సేకరించిన వడ్లు 1 లక్ష 46 వేల 83 క్వింటాళ్లు. క్వింటాలు కు @ ₹ 2060/- ధర చొప్పున లెక్కిస్తే ₹ 30,9,32,010/- ( ₹ 30 కోట్ల 9 లక్షల. 32 వేల పది రూపాయలు ) కాగా రైతుల కష్టార్జితం ఎవరి ఖాతాలో జమ చేశారో ? అనే విషయం ప్రభుత్వం విచారణ చేపడితే బడా బాబుల బాగోతం వెలుగు చూసే అవకాశం ఉంది అనే చర్చ రైతాంగంలో జరుగుతుంది.