రైతు దినోత్సవ వేడుకలలో..
J.SURENDER KUMAR,
వ్యవసాయ రంగానికి నేడు తెలంగాణ దేశానికి దిశానిర్దేశనం చేస్తున్నదని, తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతు సంక్షేమ విధానాలు తమ రాష్ట్రాలలోనూ అమలు చేయాలని రైతులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నారు అని రైతును రాజు చేయడమే కెసిఆర్ ప్రభుత్వ లక్ష్యం… మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో రెండవ రోజు శనివారం రైతు దినోత్సవం లో భాగంగా ధర్మపురి పట్టణంలో నంది చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు రైతులతో కలిసి ఎడ్ల బండ్ల తో ర్యాలీ నిర్వహించి నర్సయ్య పల్లెలోని రైతు వేదికలో జగిత్యాల జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు దినోత్సవ వేడుకల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటలు విద్యుత్ సరఫరా, పంట పెట్టుబడి కోసం ఎకరానికి ₹ 10 వేల ఆర్ధిక సాయం ఇస్తున్నది కెసిఆర్ ప్రభుత్వం,
ప్రతి ఎకరాకు సాగు నీరు, బీడు భూములు మొత్తం మాగాణి చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రి కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాకా దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణ గా తెలంగాణ అభివృద్ధి సాధించిందని, తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటు, వారి అభివృద్ధికి చేయూత అందిస్తుందని మంత్రి అన్నారు.
ఒకప్పుడు సంక్షోభంలో కూరుకొని అల్లాడిన తెలంగాణ వ్యవసాయానికి తిరిగి జవజీవాలను అందించడంలోనూ, నిరాశ, నిస్ప్రహలతో కొట్టుమిట్టాడే రైతుల్లో తిరిగి ధైర్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్ని నింపడంలోనూ ప్రభుత్వం పూర్తిగా సఫలికృతమైంది. నాడు కరువు కాటకాలతో అలమటించిన తెలంగాణ నేడు సుజల, సుఫల, సస్యశ్యామల అవుతుంది, రాష్ట్రంలోని కర్షక సోదరులు అంతా కేసీఆర్ ను రైతు బాంధవుడిగా కొలుస్తున్నారని, నిండు హృదయంతో ఆశీర్వదిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు వ్యవసాయం, వ్యవసాయ అనుబంధాల రంగాలకు అప్పటి ప్రభుత్వాలు అరకొర నిధులు మాత్రమే ఖర్చు ఖర్చు చేసేవారని , కాని రాష్ట్రం ఆవిర్భవించి నప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం 20 రేట్లు నిధులు అధికంగా ఖర్చు చేస్తుందని, అలాగే ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల తరపున 12 వందల కోట్లు విధ్యుత్ సంస్థలకు చెల్లించి ఉచిత కరెంట్ అందిస్తున్నార ప్రపంచంలోనే రైతు బంధు పథకం అమలు చేస్తూ, రైతు భీమాను చెలిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిది, పట్టా భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకు రైతు బంధు అమలు అవుతుందని మంత్రి గుర్తు చేశారు, గతంలోనూ ప్రభుత్వాలు పాలించినప్పటికి రైతు కుటుంబాలు ఏనాడు సంతోషంగా లేవని, కొందరు రాజకీయంగా ఎదుర్కోనలేక దురుద్దేశ్యంతో ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని, నిజాలను కూడా నిజం అని ఒప్పుకోవడం వారి కష్టం గా వుందన్నారు తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు అందుతున్నది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కనిపించడం లేదా ?

రాష్ట్రం లో కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాకా తెలంగాణలో వ్యవసాయం రూపు రేఖలు పూర్తిగా మారాయని, ఒక్క ధర్మపురి నియోజకవర్గంలోనే మూడు రేట్లు వరి విస్తీర్ణం పెరిగింది, అంతే కాదు ఉమ్మడి రాష్ట్రంలో మండలానికి ఇద్దరు లేదా ముగ్గురు వ్యవసాయ విస్తీర్ణ అధికారులు ఉండే వారు, కాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ను ఏర్పాటు చేసి, ఒక్కో క్లస్టర్ కు ఒక వ్యవసాయ విస్తీర్ణ అధికారిని నియమించడం జరిగింది అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది రైతులు దాశబ్ది వేడుకల్లో పాల్గొంటున్నారు
జగిత్యాల జిల్లాలో మొత్తం 71 రైతు వేదికలు ఏర్పాటు చేసి రైతులకు సలహాలు, సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది అన్నా రు.
ఇటీవల జిల్లాలో అకాల వర్షాలతో నష్ట పోయిన 380 మంది రైతులకు ప్రభుత్వం ₹ 53 లక్షలు పరిహారం అకౌంట్ లో జమ కావడం జరిగింది, రెండో విడత కింద ₹ 38 కోట్లు పంట నష్టం అంచనా వేయడం జరిగింది అన్నారు.
రైతు స్వభావాన్ని నింపుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతుల కళ్ళలో దీనత్వం తొలిగి, ధీరత్వం తొణికిస లాడుతున్నదని మంత్రి అన్నారు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఉత్తమ రైతులకు మంత్రి శాలువా తో సత్కరించారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్యమ్మ, ధర్మపురి మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యోరి రాజేష్, ఎంపిపి చిట్టిబాబు, జెడ్పీటీసీ బత్తిని అరుణ, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, వ్యవసాయ శాఖా అధికారులు, రైతులు పాల్గొన్నారు .