సమాజ మనుగడకు – చెట్లే ఆధారం ..
మంత్రి కొప్పుల ఈశ్వర్!

J. SURENDER KUMAR,

మానవ మనుగడకు చెట్లు ఆధారమని, జీవకోటికి ప్రాణవాయువు అవసరమని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ హరితోత్సవం కార్యక్రమంలో భాగంగా సారంగాపూర్ బతుకమ్మ కుంట అటవీ క్షేత్రం, ధర్మపురి మండలం నేరెళ్ళ లో జరిగిన కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,

ప్రపంచం అబ్బురపరిచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో హరిత హారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రణాళికాబద్ధంగా, భావితరాల వారికి పర్యావరణ సంపదను అందించేందుకు ప్రవేశపెట్టి, ఇప్పటి వరకు 8విడతల్లో రాష్ట్రంలో 230 లక్షల మొక్కలు నాటాలనే యూక్ష్యం కాగా, 273 కోట్ల మొక్కలు అధికారుల కృషి, ప్రజల భాగస్వామ్యంతో నాటి సంరక్షించడం జరిగిందని తెలిపారు. మొక్కల సేకరణకు జిల్లాలో నర్సరీలను ఏర్పాటుచేయడం, అవసరమైన మొక్కలు పెంచడం జరిగి, ఆయా ప్రాంతాలలో పండ్లు, పూలు, నీడనిచ్చే మొక్కలు నాటి సంరక్షించడం జరుగుతున్నదని తెలిపారు. పర్యావరణాన్ని సమతుల్యం చేయడానికి, అడవులను పూర్వ వైభవం తీసుకురావడానికి చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని తెలిపారు. స్థానిక సంస్థలలో 80 శాతం మొక్కలు సంరక్షించడానికి చట్టం రూపొందించడం జరిగిందని తెలిపారు. నిబద్ధత, సామాజిక స్పృహ, ముందు చూపుతో హరిత హారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టారని తెలిపారు.
సారంగాపూర్ లో జరిగిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ,

సమగ్ర ఆలోచనలతో హరిత హారం పవిత్ర కార్యక్రమాన్ని రూపొందించి ప్రపంచంలోనే 3వ అతి పెద్ద ప్రయత్నమని అన్నారు. యాదాద్రి మాడల్ లో మొక్కలను పెంచడం జరుగుతున్నాయని తెలిపారు.
జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ

, ఆ కాలంలో అశోకుడు చెట్లు నాటాడని మనం పుస్తకాల్లో చదివాం, కానీ రాష్ట్రంలో ని ప్రజలకు అవసరమైన పచ్చదనం అందించాలనే ముందు చూపుతో తెలంగాణ ముఖ్యమంత్రి హరితాహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి, 7.78 శాతం గ్రీనరీ కవరేజీ చేయడం జరిగిందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. జిల్లాలో 93 శాతం మొక్కలను సంరక్షించడం జరిగిందని ఆమె తెలిపారు.

జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ,

భావితరాల వారి జీవనానికి అవసరమైన వాయువు, నీరు అందించడానికి మొక్కల పెంపకం దోహదపడుతుందనీ అన్నారు. ప్రతీ గ్రామంలో నర్సరీలు ఏర్పాటు వేయడం, అవసరమైన మొక్కలు పెంచడం జరుగుతున్నాయని, గ్రీన్ ఆక్షన్ ప్లాన్ తో సుందరీకరణ పనులు చేపట్టడం, మొక్కలను సంరక్షించడం జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో 409 పల్లె ప్రకృతి వనాలు, 90 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఏ కార్యక్రమం అయినా ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతం అవుతాయని తెలిపారు. జిల్లాలో 13 ఎకరాలలో 10 బ్లాకుల్లో దశాబ్ది వనాలు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు.
అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరచిన ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు ప్రశంసా పత్రాలు, మెమొంటో లను అందించారు. ఈ కార్యక్రమాలలో ఆర్డీఓ మాధురి, స్థానిక సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపిపి, ఇతర ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.