నిందితులకు చర్లపల్లి జైల్లో పిడి యాక్ట్ ఉత్తర్వులు అందజేత.
J.SURENDER KUMAR.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆలయంలో కొద్ది నెలల క్రితం జరిగిన చోరీ సంఘటనలో పట్టుబడిన నిందితులపై జగిత్యాల జిల్లా పోలీసులు బుధవారం PD చట్టం నమోదు చేశారు. కర్ణాటక కు చెందిన రామ్ శెట్టి జాదవ్, బాలాజీ రాథోడ్, విఠల్ రావులపై నమోదు చేసి ఉత్తర్వుల కాపీని మల్యాల సి.ఐ బిళ్ళ కోటేశ్వర్, ఎస్.ఐ అశోక్ నిందితులకు చర్లపల్లి జైలు లో అందించారు.
నిందితులు దొంగతనాలకు పాల్పడుతూ సాధారణ ప్రజలను భయాందోళనను సృష్టిస్తూ శాంతిభద్రతలకు ,విగాధం కలిగిస్తూ ప్రజా జీవనంపై , సామాజిక శాంతికి భంగం కలిగిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నిందితులపై గతంలో దొంగతనం కేసులు నమోదు అయినట్టు పోలీసులు పేర్కొన్నారు.
నియంత్రణ చట్టం 1986 (చట్టం సంఖ్య 1/1986), తెలంగాణా నియంత్రణ చట్టం ( సవరణ చట్టం సంఖ్య 13/2018) ప్రకారం వీరు నేరాలకు పాల్పడే నేరస్తుని గా నిర్ధారించి, వీరి బారి నుండి ప్రజలను రక్షించాలన్న ఉద్దేశ్యంతో జగిత్యాల జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం పి.డి. యాక్ట్ నమోదు చేసినట్టు పోలీస్ లు వివరించారు.