తెలంగాణ  అన్ని రంగాల్లో అగ్రగామిగా పురోగమిస్తున్నది !

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

J.SURENDER KUMAR,

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా పురోగమిస్తున్నదని జగిత్యాల శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యులు డా. ఏం.సంజయ్ కుమార్ అన్నారు.  మంగళవారం రోజున స్థానిక విరూపాక్షి గార్డెన్ లో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ మహిళా దినోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ, అన్ని వర్గాల వారిని ఏకతాటిపై తీసుకువచ్చి, ఆయా వర్గాల వారికి అండగా నిలిచిన వ్యక్తి మన ముఖ్యమంత్రి అని వివరించారు. ఆసరా ఫించన్లు మంజూరు చేయడం జరిగిందని, దివ్యాంగులకు మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నట్లు సి.ఎం. ప్రకటించారని తెలిపారు. మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వందే అని అభివర్ణించారు. ధాన్యం కొనుగోళ్లు మహిళా సంఘాల ద్వారా చేయడం జరుగుచున్నదని తెలిపారు. అంగన్వాడీ, ఆయా, ఏఎన్ఎం ల వేతనాలు పెంచడం జరిగిందని అన్నారు. ఇంటింటికి నల్లా నీళ్ళు అందించడం జరుగుతున్నదని అన్నారు.  జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత మాట్లాడుతూ,

తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను వివరించడానికి మహిళా దినోత్సవం ను నిర్వహించుకోవడం జరుగుతున్నదని తెలిపారు.  ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించడం, అవగాహన కల్పించడం జరుగుతున్నదని అన్నారు. పెన్షన్లు, వడ్డీలేని రుణాలు, తదితర కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం మహిళలకు బాసటగా నిలుస్తున్నదని అన్నారు. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించడం జరుగుతున్నదని, మహిళల అభ్యుదయానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నారని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, ఒంటరి మహిళా, గృహలక్ష్మి వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వివరించారు.
గ్రంధాలయ చైర్మన్ చంద్ర శేఖర్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అనేక కార్య్రమాలను ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నదని అన్నారు. అంతకుముందు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై జిల్లా సంక్షేమ అధికారి డా. నరేష్ వివరించారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన మహిళా అధికారులు, సిబ్బందిని, మహిళా ప్రజా ప్రతినిధులను శాలువా, మేమొంటో, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. బ్యాంక్ లింకెజి క్రింద పట్టణ మహిళా సంఘాలకు ₹ 8 కోట్ల 29 లక్షల రుణాల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ లత, ఆర్డీఓ మాధవి, జెడ్పీటీసీలు, ఎంపిపి లు, సర్పంచులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.