మంత్రి కొప్పుల ఈశ్వర్ !
J.SURENDER KUMAR,
తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ దేశానికే మార్గ నిర్దేశకంగా నిలిచిందని, కెసిఆర్ ప్రభుత్వం పోలీస్ శాఖకు ఊహించని విధంగా బడ్జెట్ కేటాయించి పోలీస్ వ్యవస్థను పటిష్టం చేశారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్స్ సెంటర్ (CCC) తో నిఘా వ్యవస్థ ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది మంత్రి వివరించారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సురక్ష దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని ప్రసంగించారు.

,జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా .ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, డా.సంజయ్ కుమార్ , జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత, ఎస్పీ భాస్కర్, అదనపు కలెక్టర్ లు బిఎస్ లతా, మంద మకరంద, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ డాii చంద్రశేఖర్ గౌడ్, DCMS చైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చీటీ వెంకట్ రావు, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు,ప్రజా ప్రతినిధులు, డీఎస్పీలు, సిఐలు, ఎస్. ఐలు, మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.