జగిత్యాల్ జిల్లా ఎస్పీ భాస్కర్ !
J.SURENDER KUMAR.
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎలక్షన్స్ ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుండి సమస్యాత్మక గ్రామాలను అధికారులు, విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ సందర్శిస్తూ ప్రజలతో మమేకమౌతూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే విధంగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ భాస్కర్ పోలీస్ అధికారులను అప్రమత్త చేశారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో డి.ఎస్.పి సీఐల తో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..
ఎన్నికల లోఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు తీసుకోవలసి చర్యలు వివరించారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాలు, వాటిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, నార్మల్ పోలింగ్ కేంద్రాల లో, ఎలాంటి సమస్యలు లేకుండా ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని పోలింగ్ కేంద్రాలు వాటి స్థితిగతులు, భౌగోళిక పరిస్థితుల గురించి పోలింగ్ కేంద్రం వద్ద ఎంత మంది పోలీసు భద్రత అవసరమో నివేదికల అందించాలని ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జిల్లా పరిధిలోని అన్నీ బార్డర్ పిఎస్ పరిధిలల్లో ( స్టాటిక్ సర్వే లెన్స్ టీమ్స్ ) చెక్ పోస్టులకు ఏర్పాటులు చేయాలని సూచించారు. మండల కేంద్రాలలో, గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వాటిని నిరంతరం మానిటరింగ్ చేసే విధంగా ఒకరిని నియమించాలని సూచించారు..
సమస్యలను క్షేత్ర స్థాయిలో గుర్తించి ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించే విధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని అదే విదంగా రాబోవు అసెంబ్లీ ఎన్నికలకు జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని ఎస్పీ సూచించారు.

గతంలో నమోదు అయిన కేసులు, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు వాటిపై చేసిన దర్యాప్తు, విచారణ స్థితిగతులు అడిగారు. పోలీస్ స్టేషన్ ల వారిగా పెండింగ్ కేసుల దర్యాప్తు లు, పురోగతి లు అడిగి తెలుసుకున్నారు. క్వాలిటీ ఆఫ్ ఇన్విస్టిగేషన్, ప్లాన్ ఆఫ్ యాక్షన్ దర్యాప్తు లో ఉండాలని నేరస్తుల కు చట్ట ప్రకారం పడే శిక్ష తప్పించుకోకుండ రికార్డుల నిర్వహణ, సాక్ష్యాధారాల సేకరణ ఉండాలిని అన్నారు.
రాబోవు బక్రీద్ సందర్భంగా జిల్లా లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు గోవుల అక్రమ రవాణా, గోవధను నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సంతలో కొనుగోలు చేసిన పశువులకు, సంబంధిత పశు వైద్యాధికారిచే ఆరోగ్య మరియు రవాణాకు అనుమతి పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. గోవుల రవాణా జరిగే ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉంచాలని అక్రమంగా గోవులను రవాణా చేస్తున్నారనే సాకుతో బృందాలుగా ఏర్పడి అల్లర్లకు కారణమయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్పీ లు ప్రకాష్, రవీంద్ర రెడ్డి, రవీంధ్ర కుమార్, DCRB ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, , సి.ఐ లు నటేష్, లక్ష్మీనారాయణ, ఆరిఫ్ అలీ ఖాన్ , కోటేశ్వర్, ప్రవీణ్ కుమార్, RI వామనమూర్తి, ఎస్.ఐ లు DCRB, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.