ప్రభుత్వానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాల్ !
J.SURENDER KUMAR,
రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్తు ను 24 గంటల పాటు సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వం నిరూపించగలిగితే నేను ఎన్నికల్లో పోటీ చేయను అంటూ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వాని సవాల్ చేశారు.
జగిత్యాల పట్టణం ఇందిరా భవన్ లో మంగళవారం జీవన్ రెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను ప్రజలను మభ్య పెట్టడానికి, 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు ప్రచార ఆర్భాటాలు, ప్రకటనలు మినహా రైతులకు నాణ్యమైన విద్యుత్తు కనీసం 12 గంటల పాటు కూడా అందడం లేదని జీవన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం 24 గంటల పాటు విద్యుత్తును అందిస్తున్నట్టు నిరూపిస్తే.. ఎన్నికల్లో నేను పోటీ చేయను అని ఎమ్మెల్సీజీవన్ రెడ్డి అన్నారు.
జీవన్ రెడ్డి ఇలా మాట్లాడారు..
👉 2022 లో ఒక్క ట్రాన్స్ఫార్మర్ అయినా 24 గంటల విద్యుత్ సరఫరా చేశారా ?
👉 కెసిఆర్ ప్రతి పథకానికి కాంగ్రెస్ పథకాలే ఆధారం.
👉 ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధితో నే జగిత్యాలకు గుర్తింపు వచ్చింది..
👉 ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లో మేము..డబుల్ బెడ్రూం ఇల్లున్న గ్రామాల్లో మీరు ప్రచారం చేసుకుందాంమా ?
👉 రాబోయే ఎన్నికల్లో మంత్రి ఈశ్వర్ ను ప్రజలు ముక్కు భూమికి రాపిస్తారు..
👉 ప్రభుత్వ వై ఫల్యాలను ఎత్తిచూపుతూ..
👉 ఈనెల 22 న ‘ దశాబ్ది దగా ‘ పేరుతో పట్టణంలో ప్రదర్శన చేపట్టనున్నట్టు జీవన్ రెడ్డి ప్రకటించారు.
మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం , మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బండ శంకర్, తదితరులు సమావేశంలో పాల్గొన్న రు.