👉 రాముడు, కృష్డుడు అని కీర్తిస్తూ ఆయన ఫోటోకు దండలు వేశారు.
👉 సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి!
J.SURENDER KUMAR,
కర్నూలు జిల్లా పత్తికొండ. నియోజకవర్గంలో వైయస్సార్ రైతు భరోసా, పిఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాలో గురువారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాలలో జమ చేసిన సందర్భంలో చంద్రబాబు నాయుడు పై. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
👉రాజమండ్రిలో డ్రామా షో..
నిన్నకాక మొన్న రాజమండ్రిలో ఒక డ్రామ కంపెనీ మాదిరి ఒక షో జరిగింది. మహానాడు అని చెప్పి ఆ డ్రామాకు ఒక పేరు కూడా పెట్టుకున్నారు. ఆ డ్రామా చూస్తున్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. అందులో 27 సంవత్సరాల క్రితం తామే వెన్నుపోటు పొడిచి చంపేసిన మనిషిని .. మళ్లీ తామే ఆ మనిషి యుగపురుషుడని, శకపురుషుడని, ఆ మనిషి రాముడు, కృష్డుడు అని కీర్తిస్తూ ఆయన ఫోటోకు దండ వేశారు. మహానాడులో సాక్షాత్తుగా జరుగుతున్న డ్రామా ఇది.
ఆ మహానాడు డ్రామాకు మందు వీళ్లంతా ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన చూస్తే నాకు ఇంకా ఆశ్చర్యం అనిపించింది. అదేమిటంటే… తమ పార్టీ ఆకర్షణీయమైన మేనిఫెస్టోను ముందే ప్రకటించారు. మేనిఫెస్టోను ఆకర్షణీయమైన అని సంబోంధించి ప్రకటించడం..నాకు ఇంకా పెద్ద ఆశ్చర్యమనిపించింది. ఈ మాట వింటే కొన్ని కొన్ని పాత్రలు, కొన్ని కథలు గుర్తుకువస్తాయి.
👉పూతన, మారీచుడు, రావణుడు కలిసి చంద్రబాబులా..
పసిపిల్లవాడైన కృష్ణుడుని హతమార్చడానికి దుష్ట ఆలోచనలతో పూతన అనే రాక్షసి కూడా బాబు చెపుతున్నట్టుగా అందమైన మేనిఫెస్టో మాదిరిగా మోసపూరిత స్త్రీ వేషంలో రావడం గుర్తుకువచ్చింది. అందమైన మాయ లేడీ రూపంలో సీతమ్మ దగ్గరికి వచ్చిన మారీచుడు కూడా గుర్తుకు వచ్చాడు. సీతమ్మను ఎత్తుకుపోవడానికి గెటప్ మార్చుకుని భవతీ భిక్షాందేహీ అని వచ్చిన రావణుడు కూడా గుర్తుకు వచ్చాడు.
ఈ ముగ్గురు ఆత్మలూ కలిసి, ఈ మూడు క్యారెక్టర్లూ కలిపి మన ఏపీలో ఒక మనిషిగా నారా చంద్రబాబునాయుడు అనే వ్యక్తి జన్మించాడు.
👉బాబు – విలువలు, విశ్వసనీయత లేని క్యారెక్టర్..
మేనిఫెస్టో పేరుతో ప్రతి ఎన్నికకు ఒక వేషం వేస్తాడు. వాగ్ధానానికి ఒక మోసం చేస్తాడు. ఈ పెద్దమనిషి చంద్రబాబునాయుడు గారి క్యారెక్టర్ ఏమిటంటే ఈయన సత్యం పలకడు. ధర్మానికి కట్టుబడడు. మాట మీద నిలబడడు. విలువలు, విశ్వసనీయత అçసలే లేవు.
తమ పార్టీ అధ్యక్షుడు, పిల్లనిచ్చిన మామ ఎన్‌టీరామారావునైనా సరే పొడుస్తాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలనైనా పొడుస్తాడు. అధికారం కోసం ఎవరినైనా పొడవడానికి ఏమాత్రం వెనుకాడడు. చంద్రబాబు పొలిటిలక్ ఫిలాసపీ ఏమిటంటే… ఎన్నికలకు ముందు ఆకర్షణీయమైన మేనిఫెస్టో. ఆ తర్వాత ప్రజలను వెన్నుపోటు పొడవడం. మేనిఫెస్టోను చూపిస్తూ.. ఆకర్షణీయమైన మేనిఫెస్టో అని చెపుతూ.. దానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా మాట్లాడుతారు.
అసలు మేనిఫెస్టో అన్నది ఎలా తయారవుతుందన్నది బాబుకు తెలుసా ? మేనిఫెస్టో అన్నది ఎలా తయారవుతుందో ఈ పెద్ద మనిషికి అవగాహన ఉందా ?
👉మన మేనిఫెస్టో… ప్రజల ఆకాంక్షల గుండె చప్పుడు
మన పార్టీ మేనిఫెస్టో నా ఓదార్పు యాత్ర, పాదయాత్ర వల్ల ప్రజల కష్టాల నడుమ వాటి పరిష్కారం దిశగా, ప్రజల ఆకాంక్షలు, అవసరాల నుంచి వారిæ గుండెచప్పుడుగా పుట్టింది.
మన రైతులు, మన పేదలు, నా అక్కచెల్లెమ్మలు, మన ప్రాంతాలు, మన సామాజిక వర్గాలు, వారి కష్టాలు, వారి అవసరాలు నడుమ వారి ఉజ్వల భవిష్యత్ కోసం, వారికి మంచి భవిష్యత్ చూపించడం కోసం మన మట్టి నుంచి మన మేనిఫెస్టో పుట్టింది.
👉బాబు మేనిఫెస్టో – బిసిబెళ బాత్..
చంద్రబాబు మేనిఫెస్టో మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో పుట్టలేదు. వారి మేనిఫెస్టో ఏపీలో పుట్టలేదు. కారణం ఈ పెద్ద మనిషి జనంలో తిరగడు కాబట్టి.. ఆయన మేనిఫెస్టో ఏపీలో పుట్టలేదు. కర్ణాటకలో పుట్టింది. కర్ణాటకలో బీజీపీ కాంగ్రెస్ రెండూ ఎదురెదురుగా తలపడి, రెండు పార్టీలు మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కలిపేసి ఒక బిసిబెళ బాత్ వండేశాడు ఈ పెద్దమనిషి చంద్రబాబు. అంతటితో సరిపోదు అది రుచికరంగా ఉండదు, ఆకర్షణీయంగా ఉండదు అని మన అమ్మఒడి, చేయూత, రైతుభరోసా మన పథకాలన్నీ కలిపేసి ఇంకో పులిహోర వండేశాడు.
వైయస్సార్ గారి పథకాలన్నీ కాపీ, జగన్ పథకాలూ కాపీ, బీజీపీ పథకాలూ కాపీ, కాంగ్రెస్ పథకాలూ కాపీ. చివరకు బాబు బ్రతుకే కాపీ, మోసం. ఈ బాబుకు ఒరిజినాలిటీ లేదు, పర్సనాలిటీలేదు. కేరెక్టర్ లేదు, క్రెడిబులిటీ అంత కన్నా లేదు. పోటీ చేసేందుకు ఈపెద్ద మనిషికి 175 నియోజకవర్గాల్లో 175 మంది కేండిడేట్‌లు కూడా లేని పార్టీ ఇది.
👉పొత్తుల కోసం ఎంతకైనా దిగజారే పార్టీ..
మైదానాల్లో మీటింగ్‌లుపెడితే జనం రారని, మనుషులు చనిపోయినా ఫర్వాలేదని ఇరుకైన సందులు, గొందులు వెదుక్కుంటున్న పార్టీ ఇది. పొత్తులు కోసం ఎంతకైనా దిగజారే పార్టీ ఇది. ఏ గడ్డైనా తినడానికి వెనుకాడని పార్టీ ఇది. విలువలు, విశ్వసనీయత లేని పార్టీ చంద్రబాబు పార్టీ. జనంలో లేని బాబు పార్టీకి కావాల్సింది పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులే వీళ్ల పార్టీ ఫిలాసపీ.
👉ఫలానా మంచి చేశానని చెప్పుకోలేని వ్యక్తి – బాబు
1995లోనే సీఎం అయ్యి కూడా… సీఎం అయిన 30 సంవత్సరాల తర్వాత కూడా 2024లో ఎన్నికలు మరలా వస్తుంటే… ఈ పెద్ద మనిషి ఏం అడుగుతాడంటే.. నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి చేసేస్తా. మరో ఛాన్స్ ఇవ్వండి చేస్తాను అని అంటాడే తప్ప సీఎంగా ఉన్న రోజుల్లో మీ ఇంటికి ఈ మంచి చేశాను అని చెప్పి ఈ మనిషి నోటిలోనుంచి మాటలు రావు. డీబీటీ రూపంలో మీ ఇంటికి ఇంత మంచి చేశానని కానీ, మీకు ఇళ్లు కట్టించానని కానీ, రైతులకు ఈ మంచి చేశానని, గ్రామానికి మంచి చేశానని, పిల్లలకు ఈ మంచి చేశానని కనీసం ఒక్కటంటే ఒక్కటి చెప్పుకునే చరిత్రలేని వ్యక్తి చంద్రబాబు ఆయన పార్టీ.
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటాడు.. కానీ చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి పని లేని పరిపాలన ఆయన హయంలో సాగింది. రాష్ట్రంలో 1.50 కోట్ల ఇళ్ల ముందు నిలబడి మీ ఇంటికి ఈ మంచి చేశానని చెప్పలేని బాబు, సామాజిక వర్గాల ఎదురుగా నిలబడి మీకు ఈ మాట ఇచ్చి, నెరవేర్చా అని చెప్పలేని ఈ బాబును ప్రజలు ఎలా నమ్ముతారు వైఎస్ జగన్ నిలదీశారు.