మంత్రి కొప్పుల ఈశ్వర్ !
J.SURENDER KUMAR,
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 9 ఏళ్ల కాలంలో వ్యవసాయ రంగంలో అద్భుత విజయాలు సాధించిందన్నారు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
జగిత్యాల పొలాస లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శనివారం జరిగిన రైతు దినోత్సవ కార్యక్రమానికి ఎస్సి అభి వృద్ది సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.
తెలంగాణ దాశాబ్ది వేడుకల సందర్బంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రైతు దినోత్సవ వేడుకల్లో 20 లక్షల మంది రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చూపించిన మార్గ దర్శకంతో గణనియమైన ప్రగతి సాధించు కోవడం తెలంగాణ కే గర్వకారణం అని మంత్రి అన్నారు.

గత పాలకులు వ్యవసాయం సాగు, నీటి రంగాలను పూర్తి గా విస్మరించడంతో ఇన్నేళ్లు గా అన్నదాతలు ఎన్నో కష్టాలు చవి చూడాల్సి వచందన్నారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ చేస్తున్న మరెన్నో మార్గ దర్శకాలను రైతులు తుచా తప్పకుండా పాటించినట్లయితే మరింత ప్రగతి సాధించడమే కాకుండా సమస్యలు అధిగమిస్తామన్నారు. రాబోయే కాలంలో రైతులు ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు .
రైతులు ఒక నెల ముందు పంటలు వేసుకున్నట్లయితే ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటలు కాపాడు కోవొచ్చని సూచించారు. ఇందుకు వ్యవసాయ శాస్త్ర వేత్తలు రైతులకు అవగాహనా కల్గించాలన్నారు.
ధాన్యం కొనుగోలు విషయం లో కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
వాస్తవాలను రైతులకు అర్ధం అయ్యేలా చర్చించు కోవాలన్నారు.
ఈ సందర్బంగా పలువురు ఆదర్శ రైతులను మంత్రి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లాపరిషత్ చైర్మన్ దావా వసంత, జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా ,
డిసిఎంఎస్ చైర్మన్ యల్లాల శ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్నారు.