👉ప్రపంచ కెమెరా దినోత్సవ సందర్భంగా..
👉 ధర్మపురి లో వెరైటీ గా కెమేరా పూజలు!
👉 ఫోటో కెమేరాకు అమ్మవారి రూపంలో ప్రత్యేక అలంకరణ!
👉 ఛాయాచిత్ర యంత్ర దేవతా రూపంలో పూజలందుకున్న ఫోటో కెమేరా!
👉 కెమేరా కు పంచామృతాలతో అభిషేకం!
👉 కెమేరా విడిభాగాల పేర్లతో చాయా చిత్ర యంత్ర దేవతకు ప్రత్యేక అంగ పూజ…ఏకాదశ నామార్చనలు!
👉 లెన్స్ మోడల్ సైజ్ ల నామాలతో ప్రత్యేక హోమం!
J.SURENDER KUMAR,
తమకు తమ కుటుంబ సభ్యులకు జీవనోపాధి కల్పించడంతో పాటు, వివాహ లాంటి శుభ కార్యక్రమాలలో, చిత్ర విచిత్రంగా, నయ నందకరంగా ఛాయా చిత్రాలు చిత్రీకరణ కు ఆధునిక సాంకేతిక కలిగి ఉండి, తమను, తమ వృత్తిని ప్రశంసలు అభినందనలకు ఆయుధమైన ( కెమెరాలకు ) ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలోనీ శ్రీ అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు గురువారం చేపట్టారు

.
ప్రపంచ కెమేరా దినోత్సవం సంధర్బంగా కెమేరాకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి…కెమెరాను అమ్మవారి రూపంలో అలంకరించి…కెమేరా పరిభాషలో చాయా చిత్రయంత్ర దేవతా అంగపుజా…అర్చన… హోమం నిర్వహించారు.
కెమేరా దేవత ప్రత్యేక పూజా విధానంను నిర్వాంచి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి ఫోటోగ్రాఫర్లు

అర్చన…ధూప, దీప, నైవేద్యం, మంగళహారతి, హోమం…పూర్ణాహుతి…తీర్థ ప్రసాదాలు వితరణ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించారు.ఈ చాయాచిత్ర యంత్ర దేవత పూజా విధానము ప్రత్యేకతను సంతరించుకున్నది.