ఎన్నికల నియమావళి పై ప్రతి పోలీసు అధికారికి  అవగాహన ఉండాలి !


నేర స్వభావం కలిగిన వ్యక్తులను గుర్తించి బైండోవర్ చేయాలి.


సమీక్ష సమావేశం లో జగిత్యాల  జిల్లా ఎస్పీ  భాస్కర్


J. SURENDER KUMAR,

ఎన్నికల నియమావళి, ప్రవర్తన పై ప్రతి పోలీసు అధికారి అవగాహన పెంచుకొని రానున్న ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జిల్లా ఎస్పీ  సూచించారు. మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎన్నికల సమయంలో పోలీస్ శాఖ తీసుకోవాల్సిన చర్యలు, మరియు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  

ఈ సందర్భంగా ఎస్పి  మాట్లాడుతూ… ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు తీసుకోవలసి చర్యలు వివరించారు. ఎన్నికల నియమావళి, ప్రవర్తన పై ప్రతి పోలీసు అధికారి అవగాహన పెంచుకొని రానున్న ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, జిల్లాలో పోలింగ్ కేంద్రాలు వాటిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, నార్మల్ పోలింగ్ కేంద్రాల లో, ఎలాంటి సమస్యలు లేకుండా ముందస్తు ప్రణాళికల ను సంబంధిత రెవెన్యూ అధికారులతో కలిసి ప్రతి  పోలింగ్ కేంద్రని సందర్శించి వాటి స్థితిగతులు భౌగోళిక పరిస్థితుల గురించి తెలపాలని సూచించారు. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పై  దృష్టి సారించాలని తెలిపారు, విఐపి, వివిఐపి, వచ్చిపోయే సమయాలలో  అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా హైదరాబాదులో జరిగిన ఎన్నికల కమిషన్ సమావేశంలో  సూచించిన ఎలక్షన్ నియమావళి గురించి అధికారులకు వివరించారు. చట్టవ్యతిరేక కార్యక్రమాలు అయిన గంజాయి, పేకాట, మరియు గుడుంబా  వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి వాటి నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో స్థలం అనువుగా ఉన్న పోలీస్ స్టేషన్ లలో  నర్సరీలును పెంచడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు.  భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆహ్లాదకర వాతావరణం ఉండే విధంగా ప్రతి పోలీస్ స్టేషన్ ఉండాలని సూచించారు.


నేర స్వభావం కలిగిన వ్యక్తులను గుర్తించి బైండోవర్ చేయాలి.
గత ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కేసులు నమోదు అయన వ్యక్తులు, భూతగాదాల విషయం లో, పాత కక్షలు మనసులో పెట్టుకుని నేరాలు చేసేవారిని మరియు నేర స్వభావం కలిగిన వ్యక్తులను పోలీస్ స్టేషన్ ల వారిగా గుర్తించి బైండోవర్ చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్ల కదలికలపై  ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని అన్నారు.
రోడ్డు ప్రమాదాల నివరణపై అన్ని స్థాయిల అధికారులు మరింత దృష్టి సారించాలి.
హైవేలపై జరిగే యాక్సిడెంట్ లకు సంబంధించి ఫస్ట్ రెస్పాండర్స్ గా ఉండేందుకు హైవేలపై ఉన్న పెట్రోల్ బంక్ వారికి,  ధాబాలో పనిచేసే వారికి, యూత్ ,విలేజెస్, కి ఫస్ట్ ఎయిడ్ మరియు సిపిఆర్ పై అవగాహన కలిగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. బ్లాక్ స్పాట్స్(ప్రమాదాలు అధికముగా జరుగు ప్రదేశాలు)  గుర్తించి పంచాయతీ రాజ్ మరియు ఆర్&బి ప్రబుత్వ శాఖల సమన్వయంతో ప్రమాదాల నివరణ పై  దృష్టి సారించాలని అన్నారు.
ఈ   సమావేశంలో డిఎస్పీలు ప్రకాష్, రవీంద్ర రెడ్డి, రవీంద్ర కుమార్, సి.ఐ లు నటేష్, లక్ష్మీనారాయణ, ఆరిఫ్ అలీ ఖాన్ , కోటేశ్వర్,  ప్రవీణ్ కుమార్, రమణమూర్తి  ఎస్.ఐ లు DCRB, ఐటీ కోర్ సిబ్బంది  పాల్గొన్నారు.