అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి గోదావరి నది ఉధృతిని అనుక్షణం గమనించాలి!

మంత్రి కొప్పుల ఈశ్వర్ ..

J.SURENDER KUMAR,

గోదావరి నది వరద ఉధృతిని అనుక్షణం గమనిస్తూ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ధర్మపురి క్షేత్రంలోని గోదావరి నది తీర ప్రాంతం లో మంత్రి పర్యటిస్తూ పరిశీలించారు. మంగళి గడ్డ ప్రాంతం గోదావరి నది లో పెరుగుతున్న నీటి ఉధృతినీ పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుండి విడుదల చేస్తున్న నీటితో గోదావరి ఉధృతి పెరిగిందన్నారు. ధర్మపురి క్షేత్రానికి వస్తున్న భక్తులు, పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. పోలీస్ సహ ప్రభుత్వ యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ భక్తులు, ప్రజలు నది తీరాన వెళ్లకుండా కాపలా ఉండాలని ఆదేశించారు.