J.SURENDER KUMAR.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2వ ఏఎన్ఎంల సమస్యల పరిష్కారం పై నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తూ అందులో భాగంగా జగిత్యాల లకు ఆదివారం వచ్చిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు బీసీ నాయకులు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకుడు మూసి పట్ల లక్ష్మీనారాయణ, మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా తాత్కాలిక పద్దతిలో విధులు నిర్వహిస్తున్న ఎ.ఎన్.ఎం లను రెగ్యులరైజ్ చేయాలని, ఆరోగ్య ఉపకేంద్రాల లో 1వ ఎ.ఎన్.ఎం కి సమానంగా విధులు నిర్వరిస్తున్న ఉద్యోగులను కాంట్రాక్టు, ఎన్.హెచ్.ఎం ఉద్యోగులు అని చిన్నచూపు చూస్తున్నారని, కోవిడ్-19 మహమ్మారి విశృంఖలంగా కరాళనృత్యం చేస్తున్న తరుణంలో వైరస్ గురించి సరైన అవగాహన వారు కల్పించారని అన్నారు.
లేకున్నా ప్రజలు బయటకు రాలేని స్థితిలో ఉన్నారని ప్రాణాలకు తెగించి అన్ని సేవలు అందించి, తరువాత కోవిడ్-19 నిరోధక టీకాలు కూడా వచ్చినప్పుడు విశ్రాంతి లేకుండా రాష్ట్రంలో అర్హులందరికీ టీకాలు వేసి అన్ని రకాల వైద్య సేవలు అందించడంలో ముందున్న ఉద్యోగులు వారని, అన్నారు. ఆర్.ఓ.ఆర్ (R.O.R) ఆధారంగా ఎలాంటి వ్రాత పరీక్ష లేకుండా భర్తీ చేయాలని, ఆలోపు MPHA (F) మాదిరిగా మూల వేతనం, కరువు భత్యం, ఇంటి అద్దెలు చెల్లించాలనే వారి న్యాయబద్ధమైన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంల బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చింతల గంగాధర్, బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యనిర్వాహక కార్యదర్శి అలిశెట్టి ఈశ్వరయ్య, బి.సి యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కొక్కు గంగాధర్, బి.సి సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు తిరుపురం రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.