ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు కోసం చేపట్టిన నిరాహార దీక్ష కు – అపూర్వ స్పందన!

J.SURENDER KUMAR,


జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు కోసం ఆర్డీవో కార్యాలయం ముందు చేపట్టిన నిరాహార దీక్ష కు అపూర్వ స్పందన వచ్చింది.
జిల్లాలోని మండల నుండి భారీ సంఖ్యలో ఆర్యవైశ్యలు, నాయకులు, మహిళా నాయకులు జగిత్యాలకు తరలివచ్చి దీక్షలో పాల్గొన్న నాయకులు మహంకాళి రాజన్న, శ్రీమతి జక్కు పద్మ లతో శిబిరంలో కమటాల శ్రీనివాస్, కొత్త సురేష్, మానుక ప్రవీణ్, శ్రీనివాస్, ఆక్కన పెళ్లి కాశీనాథ్, తదితరులకు పలువురు ఆర్యవైశ్య సంఘం నాయకులు సంఘీభావ తెలిపారు.

సంఘీభావం


బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ Dr. బోగ శ్రావణి , ఓబీసీ మోర్చా అధ్యక్షులు కొక్కు గంగాధర్ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి, మల్లీశ్వరి మరియు తదితరులు దీక్షా కు సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి, బండ శంకర్ శిబిరానికి చేరుకొని మద్దతు ప్రకటించారు. వారు ఆర్యవైశ్య కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం 2018 ఎన్నికల మేనిఫెస్టోలో వైశ్య కార్పోరేషన్ ఏర్పాటుకు హామీ ఇచ్చి నేటికీ అమలు చేయలేదు. అన్నారు
ఉద్యమంలో నిరు పేద ఆర్య వైశ్య, వర్తక వ్యాపారులు కీలక పాత్ర పోషించి చిరు వ్యాపారులు వందల సార్లు వారి దుకాణాలు మూసివేసి, వ్యాపారాలు బంద్ చేసుకొని తెలంగాణ కోసం ఉద్యమించారు. తెలంగాణ రాష్ట్రలో రెండు సార్లు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు ఆర్యవైశ్యులు సహకరించారని ఆ సంఘ నాయకులు తమ ప్రసంగాల్లో వివరించారు
డిమాండ్స్
👉 ఆర్యవైశ్య కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి.
👉 అన్ని కులాల వారికి ఇచ్చిన విధంగానే నిరు పేద వైశ్యులకు ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం ( బీద బంధు ) ఇవ్వాలి.
👉 గృహ లక్ష్మీ పథకంలో నిరు పేద ఆర్య వైశ్యులకు అవకాశం కల్పించాలి.
తదితర డిమాండ్స్ తో ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు.