ప్రధాని ప్రభుత్వ అవినీతిని ప్రోత్సహిస్తున్నారా ?
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !
J.SURENDER KUMAR,
ప్రధాని నరేంద్ర మోడీ కెసిఆర్ అవినీతి ప్రభుత్వంపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ? ప్రభుత్వ అవినీతిని ప్రోత్సహిస్తున్నారా ? ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రధాని మోడీ తీరును ప్రశ్నించారు.
జగిత్యాలలోని ఇందిరా భవన్ లో ఆదివారం విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడారు.
జీవన్ రెడ్డి మాటలలో…
దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం అంటే తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం అని వరంగల్ సభ లో స్వయంగా ప్రధాన మంత్రి చెప్పారు..
మరి ఆధారాలు ఉన్న కూడా ఎందుకు సిఎం కేసీఆర్ పై చర్యలు తీసుకోవట్లేదు అని…. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ..
చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా ప్రోత్సాహిస్తున్నట్టే అని అన్నారు. ..మీ ఈడి, సీఐడి ఎం చేస్తుంది అని, బిజెపి, బీఆర్ఎస్ మైత్రి బంధానికి ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనం ఏం కావాలి అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.
ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుమార్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు గిరి నాగభూషణం, నాయకులు బండ శంకర్ నందయ్య, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.