బంగారు తెలంగాణ అంటే పరిశ్రమలు మూసివేయడమేనా ?

కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నర్సింగరావు!


J. SURENDER KUMAR,

బంగారు తెలంగాణ అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలైన చక్కెర ఫ్యాక్టరీ మూసి వేయడమా? బిఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడం రైతులకు శాపంలా మారిందని, నడుస్తున్న ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని మూసివేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వందని కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వడి నర్సింగరావు అన్నారు.

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ కర్మాగారం మూసివేసి నేటికి ఎనిమిది సంవత్సరాలు అవుతుందని దీనికి నిరసనగా రైతులు, మరియు ఫ్యాక్టరీ ఉద్యోగుల, కార్మికుల పక్షాన జువ్వాడి నర్సింగరావు , జువ్వాడి కృష్ణారావుల ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ తెరిపించాలని శనివారం ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా జువ్వాడి బ్రదర్స్ మాట్లాడుతూ
దైర్యంగా కొట్లాడుదాం ఫ్యాక్టరీ పునరుద్దరణ జరిగే వరకు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణలో బిఆర్ఎస్, బీజేపీ రెండు విఫలం అయ్యాయి అన్నారు.
ఎన్నికల సమయంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని కచ్చితంగా తెరిపిస్తానని హామీ ఇచ్చి ఓట్లు దండుకుని నేడు ఇచ్చిన హామీని నెరవేర్చని ఘనత ఎమ్మెల్యేకు దక్కుతుందని అన్నారు.. కోరుట్ల ఎమ్మెల్యేకు కమిషన్ల, కలెక్షన్ల మీద ఉన్న శ్రద్ధ, తనయుడు సంజయ్ పొలిటికల్ ప్రమోషన్ మీద ఉన్న ఆసక్తిలో ఒక్క శాతం కూడా ఫ్యాక్టరీ పునరుద్ధరణ మీద లేదని ప్రజలకు అర్థం అయిందని అన్నారు..
జూలై 30 లోపు రైతులతో ముఖాముఖి నిర్వహించాలని, రైతుల మరియు చెరుకు ఫ్యాక్టరీ కార్మికులతో మాట్లాడాలని లేని పక్షంలో రాజకీయ సన్యాసం స్వీకరించాలని డిమాండ్ చేశారు.


పిసిసి అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపు ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేస్తామని ఇచ్చిన హామీని వారు గుర్తు చేశారు. యూత్ కాంగ్రెస్ శ్రేణులు నిరసనగా సీఎం కేసీఆర్,నిజామాబాద్ ఎంపీ అరవింద్,ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పాదయాత్రలో చెరుకు రైతు నాయకులు మామిడి నారాయణరెడ్డి, మాజీ జెడ్ పి టి సి ఎల్లల జలపతి రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పుండ్ర శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొమిరెడ్డి లింగారెడ్డి, చిట్టాపూర్ సర్పంచ్ డాక్టర్ సాయికుమార్, రాజేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి,నరేందర్ రెడ్డి, వికలాంగుల సంగం జిల్లా అధ్యక్షులు నర్సయ్య, రైతు నాయకులు కొత్తపల్లి రాజారెడ్డి, మల్లాపూర్ ఎంపీటీసీ మల్లయ్య సత్తమ్మ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, అల్లూరి మహేందర్ రెడ్డి, వేంపేట ఉపసర్పంచ్ గోరుమంతుల ప్రవీణ్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ సుంకెట నారాయణ రెడ్డి, మెట్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జెట్టి లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సురేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొంతం రాజం, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్, ఉపాధ్యక్షులు ఎం ఏ నయిం, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు రిజ్వాన్, కార్యదర్శి మ్యాకల నర్సయ్య, ప్రధానకార్యదర్శి తుపాకుల బాజన్న, సహాయకార్యదర్శులు ఎంబేరి సత్యనారాయణ, చిటిమెల్లి రంజిత్ గుప్త, చిలువేరి విజయ్, బారి, కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.