బోనాలు ఎత్తుకున్న ఎమ్మెల్యే సంజయ్, జడ్పి చైర్మన్ వసంత !

వైభవంగా  పద్మశాలి పోచమ్మ బోనాలు !


J.SURENDER KUMAR,

జగిత్యాల పట్టణములోని వాణి నగర్ పద్మశాలి పోచమ్మ బోనాల ఉత్సవం ఆదివారం వైభవంగా జరిగింది.  స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ , జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, బోనాలు ఎత్తుకొని పోచమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నరు.
ప్రతి ఇంటి నుంచి ఒక బోనం ఎత్తకున్న మహిళలతో బోనాల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచి బోనాలను తీర్చిదిద్దిన స్థానిక మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలను సమర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జడ్పి ఛైర్మన్ దావా వసంతలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో అన్నికులాల సభ్యులు పోచమ్మ బోనాలను తీయడం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. పోచమ్మ బోనాలను తీసి తమ మొక్కులను సమర్పిస్తూ పండుగలా జరుపుకోవడం శోభానిస్తోంది. ఇందులో పాల్గొనడం తన అదృష్టమని ఎమ్మెల్యే  అన్నారు. అమ్మవారి కృపతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే కోరుకున్నారు. అనంతరం జడ్పి చైర్మన్ వసంత మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో మన పండుగలకు అంత ప్రాధాన్యత ఉండేది కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వ సహకారంతో ప్రతి పండుగ వేడుకలా జరుగుతోందన్నారు. పోచమ్మ తల్లి దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దావా వసంత అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్  ఇంచార్జ్ చైర్పర్సన్ గోలి శ్రీనివాస్, వాణి నగర్ పద్మశాలి సేవా సమితి సభ్యులు  కొక్కుల ప్రభాకర్, గుర్రం రాము, చెన్న చంద్రయ్య, చెన్న రఘు, వాసం రఘు,  జుంజురు శ్రీహరి, చెన్నూరి సత్యనారాయణ, కటుకం రవీందర్ సేవాసమితి సభ్యులు,  మహిళలు,   పాల్గొన్నారు.