J. SURENDER KUMAR,
ధర్మపురి మండలం జైన గ్రామంలో పోచమ్మ బోనాలకు హాజరైన సంక్షేమ శాఖ మంత్రి
కొప్పుల ఈశ్వర్ బోనం ఎత్తుకొని పోచమ్మకు పూజలు చేశారు.
గ్రామంలో పోచమ్మ బోనాలను పురస్కరించుకొని గ్రామస్తులు గురువారం భక్తిశ్రద్ధలతో బోనం ఎత్తుకొని డప్పు చప్పుల్ల మధ్యలో ఊరేగింపుగా వెళ్లి బోనం చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. ధర్మపురి నియోజకవర్గం ప్రజలు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ పోచమ్మ తల్లిని మంత్రి ఈశ్వర్ పూజలు చేశారు. భారీ సంఖ్య ప్రజలు మహిళలు ఊరేగింపులో పాల్గొన్నారు.