బౌన్సర్‌ల రక్షణలో టమోటాలు అమ్మకం -కూరగాయల దుకాణాలకు బౌన్సర్‌లు!


J.SURENDER KUMAR,

పెరుగుతున్న కూరగాయల ధరల నేపథ్యంలో  ఉత్తరప్రదేశ్ లో  కూరగాయల అమ్మకం దారుడు  టమోటాలను దోపిడీ నుంచి రక్షించుకోవడానికి  బౌన్సర్‌లను నియమించుకున్నాడు.
పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా సరఫరాలు తగ్గడంతో దేశవ్యాప్తంగా శుక్ర శనివారాలలో టమాట రిటైల్ ధరలు కిలోకు ₹162 వరకు పెరిగాయి. వినియోగదారుల వ్యవహారాలు నిర్వహించే డేటా ప్రకారం, మెట్రోలలో, రిటైల్ టొమాటో ధరలు అత్యధికంగా కోల్‌కతాలో కిలో ₹ 152, ఢిల్లీలో ₹ 120, చెన్నైలో ₹ 117 మరియు ముంబైలో ₹ 108గా ఉన్నాయి
.

దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో, యూపీలోని వారణాసిలో కూరగాయల విక్రయదారుడు కూరగాయలను కొనుగోలు చేసేందుకు వచ్చే వారి ని ( కస్టమర్లను) దూరంగా ఉంచేందుకు బౌన్సర్లను నియమించుకున్నాడని   PTI వార్తా సంస్థ కథనం ప్రచురించింది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా టమోటా ధరలు భారీగా పెరిగాయి. “టమోటా ధర చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నేను బౌన్సర్‌లను పెట్టుకున్నాను కొనుగోలుదారులు మూకుమ్మడిగా టమాటాల కోసం ఎగబడుతున్నారని, ఘర్షణలకు పాల్పడుతున్నారు ,మరియు టమోటాలు కూడా దోచుకుంటున్నారు అని కూరగాయల దుకాణదారుడు వివరించారు.

కూరగాయల దుకాణం కు రక్షణగా బౌన్స్సర్

మా దుకాణంలో పెద్ద మొత్తంలో టమోటాలు ఉన్నాయి, మాకు ఎటువంటి వివాదాలు వద్దు, కాబట్టి నాకు ఇక్కడ బౌన్సర్లు ఉన్నారు. టమోటాలు రూ. రూ. కిలోకు 160. ప్రజలు 50 లేదా 100 గ్రాములు కొనుగోలు చేస్తున్నారు, ”అని విక్రేత అజయ్ ఫౌజీ  పిటిఐకి  వివరించారు.


( ఫ్రీ ప్రెస్ జనరల్ సౌజన్యంతో)