సీఎం దిష్టిబొమ్మ దగ్ధం- ముందస్తుగా లక్ష్మణ్ కుమార్ ను అదుపులో తీసుకున్న పోలీసులు !

J.SURENDER KUMAR,

బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తూ  విద్యుత్ సంస్థలను అప్పుల్లో ముంచిన రాష్ట్ర ప్రభుత్వ మోసాలకు నిరసనగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపుమేరకు బుధవారం  ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలోస్థానిక సబ్ స్టేషన్ ముందు సీఎం దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.
అధికార బి.ఆర్.ఎస్ పార్టీకి చెందిన నాయకులు రేవంత్ రెడ్డి  దిష్టి బొమ్మను దగ్ధం చేస్తుండగా పోలీసులు మౌనం వహించి, సీఎం  దిష్టి బొమ్మను దగ్ధం చేయడానికి పూనుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అడ్డుకుంటున్నారంటూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ఆరోపిస్తుండగా ఆయనను స్థానిక  అంబేద్కర్ కూడలి వద్ద పోలీసులు అదుపులో తీసుకున్నారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగన బట్ల దినేష్  మాట్లాడుతూ..
బిఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి  మాటలను వక్రీకరించి, రైతులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని తప్పుడు ప్రచారం చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.  వైఎస్ రాజశేఖర రెడ్డి  హయాంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి,  రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయించింది కాంగ్రెస్ పార్టీ అని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆదరణ పెరిగి భవిష్యత్తులో అధికారం లోకి వస్తుందనే భయంతోనే ఈ విధమైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయని దినేష్  అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు
..